Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!
`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌ని మ‌లుపు లిప్పిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. య‌ష్ హీరోగా న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రాత్రికి రాత్రే య‌ష్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి క‌న్న‌డ చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది. తొలి భాగం ఊహించ‌ని స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో రెండ‌వ భాగంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రెండ‌వ భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని పోలీన పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క విల‌న్ అధీరాగా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌బోతున్నారు. `రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్` పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ఆర్ ఎఫ్‌సీలో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

జ‌న‌వ‌రి 8న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్ర‌త్యేకంగా  టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ రోజు హీరో య‌స్ పుట్టిన రోజు కావ‌డ‌మేనని తెలిసింది. జ‌న‌వ‌రి 8న రాక్‌స్టార్ య‌ష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సంజ‌య్‌ద‌త్ పాత్రని చూపిస్తారా లేదా? అన్న‌ది ఇంకా తెలియాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All