Homeటాప్ స్టోరీస్న‌రాచీ గేట్లు తెరిచే స‌మ‌యం వ‌చ్చేసింది!

న‌రాచీ గేట్లు తెరిచే స‌మ‌యం వ‌చ్చేసింది!

న‌రాచీ గేట్లు తెరిచే స‌మ‌యం వ‌చ్చేసింది!
న‌రాచీ గేట్లు తెరిచే స‌మ‌యం వ‌చ్చేసింది!

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేప‌థ్యంలో వ‌చ్చిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. భార‌తీయ సినిమాల్లోనే `బాహుబ‌లి` త‌రువాత హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. భార‌తీయ తెర‌పై హాలీవుడ్ సినిమా అనేంత‌గా ఈ చిత్రాన్ని దర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రూపొందించిన తీరు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ సినిమాలో న‌టించిన రాక్‌స్టార్ యష్ ఓవ‌ర్ నైట్‌లోనే పాన్ ఇండియా స్టార్‌ని చేసింది.

ఈ చిత్రానికి కొన‌పాగింపుగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రాబోతోంది. తొలి భాగం సంచ‌ల‌నం సృష్టించ‌డంతో రెండ‌వ పార్ట్‌పై దేశ వ్యాప్తంగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వాటికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో రెండ‌వ భాగాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్‌ద‌త్ న‌టిస్తున్నారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని పోలిన పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ న‌టిస్తున్నీ చిత్రం తొలి భాగానికి మించి ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో, స‌ర్‌ప్రైజెస్‌తో రాబోతోంది.

- Advertisement -

ఈ శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. గ‌రుడ‌ని అంతం చేసిన త‌రువాత రాఖీ న‌రాచీని త‌న త‌న చేతుల్లోకి తీసుకుంటాడు. అక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లుకాబోతంంది. దీంతో న‌రాచీకి బాస్‌గా మారిన త‌రువాత‌ రాఖీభాయ్ లుక్ ఎలా వుండ‌బోతోందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దాన్ని గ‌మ‌నించిన మేక‌ర్స్ న‌రాచీలో య‌ష్ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుద‌ల చేయ‌బోతున్నారు. అంటే న‌రాచీ గేట్లు తెరిచే స‌మ‌యం వ‌చ్చేసింద‌న్న మాట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All