Homeరివ్యూస్తొలిప్రేమ రివ్యూ

తొలిప్రేమ రివ్యూ

tholi-prema-movie-review-ratingనటీనటులు : వరుణ్ తేజ్ , రాశి ఖన్నా , సుహాసిని
సంగీతం : ఎస్ ఎస్ థమన్
నిర్మాత : భోగవల్లి ప్రసాద్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 10 ఫిబ్రవరి 2018

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది . పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేసిన సినిమా తొలిప్రేమ , అయితే ఇన్నాళ్ల తర్వాత అదే టైటిల్ తో సినిమా చేసారు కాకపోతే ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ అన్న కొడుకు వరుణ్ తేజ్ హీరో . బాబాయ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా వరుణ్ కు కూడా స్టార్ డం ని అందించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

కోపిష్టి అయిన ఆదిత్య ( వరుణ్ తేజ్ ) కు ట్రైన్ జర్నీ లో వర్ష ( రాశి ఖన్నా ) పరిచయం అవుతుంది , తొలిచూపులోనే వర్ష ని ప్రేమిస్తాడు ఆదిత్య . అయితే ట్రైన్ దిగగానే వర్ష కనబడకుండా పోతుంది కట్ చేస్తే …….. మూడు నెలల తర్వాత ఆదిత్య చదివే కాలేజ్ లోనే వర్ష కూడా జాయిన్ అవుతుంది దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది కానీ ఓ గొడవ మూలంగా ఆదిత్య – వర్ష లు విడిపోతారు . అలా ఆరు సంవత్సరాలు గడిచిపోతుంది , ఆదిత్య లండన్ లో జాబ్ చేస్తుంటాడు లక్కీ గా అదే కంపెనీ లో జాబ్ లో జాయిన్ అవుతుంది వర్ష . ప్రేమించిన వర్ష అంటే ఆదిత్య కు ఇంకా కోపం ఉందా ? తగ్గిందా ? చివరకు ఇద్దరూ ఒకటయ్యారా ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

వరుణ్ తేజ్
రాశి ఖన్నా నటన , గ్లామర్
ఛాయాగ్రహణం

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ స్లో నేరేషన్

నటీనటుల ప్రతిభ :

ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ మెప్పించాడు , నటనలో మాత్రమే కాకుండా మేకోవర్ తో కూడా స్టైల్ చూపించాడు . అలాగే డ్యాన్స్ లో కూడా బెటర్ అయ్యాడు . ముఖ్యంగా రాశి ఖన్నా – వరుణ్ తేజ్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది . రాశి ఖన్నా కు మంచి పాత్ర లభించింది కెరీర్ లోనే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అలాగే అంత అందంగా నటించింది కూడా . నటన తోనే కాకుండా గ్లామర్ తో కుర్రాళ్ళని కట్టిపడేసింది . జబర్దస్త్ ఆది పంచ్ లతో అలరించాడు . ప్రియదర్శి ఫ్రెండ్ క్యారెక్టర్ లో రాణించాడు . నరేష్ – సుహాసిని లు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

తమన్ పాటలతోనే కాకుండా నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు , ఇక ఈ సినిమాకు హైలెట్ జార్జ్ విలియమ్స్ అందించిన ఫోటోగ్రఫీ . ప్రతీ ఫ్రెమ్ ని అందంగా మలిచాడు దాంతో సినిమా మరింతగా కన్నుల పండుగల తోచింది . భోగవల్లి నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికి వస్తే …… రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ తొలిప్రేమ ని రూపొందించాడు . ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్ మెంట్ తో పాటు రొమాంటిక్ గా మలచగా సెకండాఫ్ కు వచ్చేసరికి కొన్ని బోరింగ్ సన్నివేశాలతో కాస్త నీరసపడేలా చేసినప్పటికీ ఓవరాల్ గా కుర్రాళ్ళు కోరుకునే ప్రేమకథా చిత్రాన్ని అందించి సక్సెస్ అయ్యాడు తొలి ప్రయత్నం లోనే .

ఓవరాల్ గా :

యూత్ కి నచ్చే తొలిప్రేమ

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All