Homeటాప్ స్టోరీస్గుడ్ న్యూస్ : డిసెంబ‌ర్ 11 నుంచి థియేట‌ర్లు రీ ఓపెన్‌?

గుడ్ న్యూస్ : డిసెంబ‌ర్ 11 నుంచి థియేట‌ర్లు రీ ఓపెన్‌?

గుడ్ న్యూస్ : డిసెంబ‌ర్ 11 నుంచి థియేట‌ర్లు రీ ఓపెన్‌?
గుడ్ న్యూస్ : డిసెంబ‌ర్ 11 నుంచి థియేట‌ర్లు రీ ఓపెన్‌?

దేశ వ్యాప్తంగా థియేట‌ర్లు మూసి వేయ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌, దాన్ని న‌మ్మ‌కున్న కార్మికులు అల్లాడుతున్నారు. ఇటీవ‌ల థియేట‌ర్లు రీ ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శకాల్ని విడుద‌ల చేసింది. అయితే ఆ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ థియేట‌ర్లు రీ ఓపెన్ చేయ‌డం కంటే నిబంధ‌న‌లు లేకుండా ఎప్పుడు తెర‌వ‌చ్చో చెబితే అప్పుడే రీఓపెన్ చేస్తే మంచిద‌ని ఎగ్జిబిట‌ర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు పూర్తిగా ఎప్పుడు రీ ఓపెన్  చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అంటే థియేట‌ర్లు త‌మ చేతుల్లో పెట్టుకున్న దిల్ రాజు, డి. సురేష్‌బాబు, గీతా ఆర్ట్స్‌ అల్లు అర‌వింద్ లాంటి వాళ్ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేదు. సురేష్‌బాబు మాత్రం ఇప్పుడే రీఓపెన్ చేసి ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవాల‌నే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ఆంధ్రాలో థియేట‌ర్ల‌కు అనుమ‌తి ల‌భించింది. కానీ తెలంగాణ‌లో మాత్రం ఇంత వ‌ర‌కు థియేట‌ర్ల రీ ఓపెన్‌పై స్ప‌ష్ట‌త రాలేదు. మంగ‌ళ‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి జీవో విడుద‌లైంది.

- Advertisement -

అయితే తెలంగాణ ప్ర‌భుత్వ జీవోపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి స్పంద‌న లేదు. కొంత మంది మాత్రం జీవోలో క్లారిటీ లేద‌ని చెబుతున్నారు. అయితే తెలంగాణ‌లో థియేట‌ర్ల రీ ఓపెన్‌పై బుధ‌వారం లేదా గురువారం ప్ర‌భుత్వం నుంచి మ‌రో జీవోని విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లోనే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం వుంద‌ని తాజాగా వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All