Homeటాప్ స్టోరీస్ఎక్స్‌క్లూసివ్‌: థియేట‌ర్స్ బంద్ అంతా పుకారే: ప‌్ర‌స‌న్న‌కుమార్‌

ఎక్స్‌క్లూసివ్‌: థియేట‌ర్స్ బంద్ అంతా పుకారే: ప‌్ర‌స‌న్న‌కుమార్‌

ఎక్స్‌క్లూసివ్‌: థియేట‌ర్స్ బంద్ అంతా పుకారే: ప‌్ర‌స‌న్న‌కుమార్‌
ఎక్స్‌క్లూసివ్‌: థియేట‌ర్స్ బంద్ అంతా పుకారే: ప‌్ర‌స‌న్న‌కుమార్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దీని కార‌ణంగా చాలా వ‌రకు జ‌న జీవితం వ‌ర‌ల్డ్ వైడ్‌గా స్థంభించి పోయింది. ఒక దేశం నుంచి మ‌రో దేశంలోకి వెళ్లాలంటే అన‌ధికారిక ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. ఎవ‌రికి ఎక్క‌డ క‌రోనా వైర‌స్ సోకుతుందోన‌ని ఆయా దేశాల ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల‌లో భాగంగా టూరిస్ట్‌ల‌పై కూడా ఆంక్ష‌లు విధిస్తున్నారు.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ క‌రోనా వైర‌స్ ప్ర‌భ‌ల కుండా దీన్ని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సినిమాల షూటింగ్‌ల‌ని కూడా స్టార్స్ వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్‌, అల్లు అర్జ‌న్, నాగార్జున‌ వంటి స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. అయితే తాజాగా జ‌నం షాపింగ్ మాల్స్‌కి, థియేట‌ర్స్‌కి అధిక సంఖ్య‌లో రావ‌డం లేదు. థియేట‌ర్స్ ఆక్యు పెన్సీ కొంత వ‌ర‌కు త‌గ్గింది. అయితే దీన్ని బూచీగా చూపించి కొంత మంది పుకార్ల‌ని సృష్టించ‌డం మొద‌లుపెట్టారు.

- Advertisement -

థియేట‌ర్ల‌ని 15 రోజుల పాటు బంద్ చేస్తున్నార‌ని, ఏప్రిల్ నుంచి మ‌ళ్లీ ఓపెన్ చేస్తార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ పుకార్‌లో ఎలాంటి నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చారు నిర్మాత‌ ప్ర‌స‌న్న‌కుమార్. థియేట‌ర్స్ బంద్ నిర్ణ‌యం కేవ‌లం ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యం. అది మేము తీసుకునేది కాదు. ఒక‌వేళ ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ని బంద్ చేయాల‌ని నిర్ణ‌యిస్తే ఇండ‌స్ట్రీ దానికి క‌ట్టుబ‌డి వుంటుంది. అంతే కానీ ఇండ‌స్ట్రీవారు థియేట‌ర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోలేదు. కొంత మంది అలా అని ప్ర‌చారం చేస్తున్నారు అంతేకానీ అందులో ఎలాంటి నిజం లేదు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా జ‌నాలు థియేట‌ర్ల‌కు ఇంత‌కు ముందు కంటే కొంత త‌క్కువ‌గా వ‌స్తున్నారు. అంతే కానీ థియేట‌ర్ల‌న్నీ క‌రోనా కార‌ణంగా ఖాలీగా వుండ‌టం లేదు` అని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All