Homeటాప్ స్టోరీస్ఇబ్బంది ఏం లేదట.. అదే ఆర్దర్లో సినిమాలు

ఇబ్బంది ఏం లేదట.. అదే ఆర్దర్లో సినిమాలు

ఇబ్బంది ఏం లేదట.. అదే ఆర్దర్లో సినిమాలు
ఇబ్బంది ఏం లేదట.. అదే ఆర్దర్లో సినిమాలు

నిజానికి ఈరోజు ఉగాది కాబట్టి సినిమాల విడుదలలు ఉండేవి. మార్చ్ 25న నాని నటించిన వి చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు రిలీజయ్యేవి. రెండు నెలలుగా స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీకి, థియేటర్లకు కొంత ఊపు వచ్చేది. ఇక ఉగాది తర్వాత నుండి వరసగా సినిమాల జాతరే. ఏప్రిల్ 2న మూడు సినిమాలు, ఏప్రిల్ 9న మరో రెండు సినిమాలు.. ఇలా పేరున్న సినిమాలు అన్నీ సమ్మర్ కు షెడ్యూల్ అయ్యాయి. సరిగ్గా అప్పుడు వచ్చింది కరోనా మహమ్మారి. దాని కారణంగా షూటింగ్ లు రద్దయ్యాయి. సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. మొదట మార్చ్ 21 వరకూ సినిమా రిలీజ్ లను ఆపేసారు. తర్వాత దాన్ని మార్చ్ 31కి షిఫ్ట్ చేసారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించడంతో అప్పటివరకూ సినిమాల రిలీజ్ లు ఉండవు. మరి దాని తర్వాత పరిస్థితి అంతా నార్మల్ అయ్యి సినిమాల రిలీజ్ లకు అనుమతి లభిస్తే అప్పుడు ఏ సినిమా ఎప్పుడు వస్తుంది?

ఈ ప్రశ్నకు నిర్మాతల మండలి సమాధానమిచ్చింది. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు షెడ్యూల్ అయిన రిలీజ్ ఆర్డర్ లోనే సినిమాలు తర్వాత విడుదలవుతాయని తెలిపింది. అయితే ఎవరైనా పోటీ కోరుకుంటే సినిమాలను వాయిదా వేసుకోవచ్చని లేని పక్షంలో అదే ఆర్డర్ లో సినిమాలు వస్తాయని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

అయితే సినిమాల రిలీజ్ ల వరకూ ఓకే కానీ షూటింగ్ బ్యాలన్స్ ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆర్టిస్ట్స్, సాంకేతిక నిపుణుల డేట్స్ మళ్ళీ సంపాదించడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. అందులో భారీ బడ్జెట్ చిత్రాలకు బిజీ నటీనటులు ఉంటారు. వేరే భాషల్లో కూడా చేసే వారైతే ఇక వారు డేట్లు అన్ని సినిమాలకు కేటాయించడానికి తల ప్రాణం తోకకొస్తుంది. ఏప్రిల్ 15 తర్వాతైనా పరిస్థితులు నార్మల్ కు వస్తే అదే చాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All