Homeటాప్ స్టోరీస్విజయ్ సినిమాకు కరోనా పెద్ద దెబ్బ

విజయ్ సినిమాకు కరోనా పెద్ద దెబ్బ

విజయ్ సినిమాకు కరోనా పెద్ద దెబ్బ
విజయ్ సినిమాకు కరోనా పెద్ద దెబ్బ

ఇళయథలపతి విజయ్ కు తమిళంలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా అతని సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చోటు సంపాదిస్తాయి. అదే రేంజ్ లో నెక్స్ట్ సినిమాకు సంబందించిన బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా విజయ్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది అలాగే రెండు చిత్రాలను రిలీజ్ చేసాడు. రెండు సినిమాలతో కూడా సక్సెస్ లను అందుకున్నాడు. గతేడాది దీపావళికి బిగిల్ చిత్రంతో అందరినీ అలరించిన విజయ్ చాలా తక్కువ సమయంలోనే నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసాడు. మాస్టర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

ఖైదీ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సినిమాను డిసెంబర్ లో మొదలుపెట్టాడు. వరస షెడ్యూల్స్ తో పక్కా ప్లానింగ్ తో ఏప్రిల్ లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లానింగ్ కు తగ్గట్లుగానే మూడే నెలల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేసారు మాస్టర్ టీమ్.

- Advertisement -

షూటింగ్ పూర్తవ్వడంతోనే ప్రమోషన్స్ లోకి కూడా దిగిపోయారు. పాటల వేడుక కార్యక్రమం కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వస్తున్నాయి. ఇక మాస్టర్ సంబరాల కోసం విజయ్ ఫ్యాన్స్ సిద్ధమవుతుండగా కరోనా పిడుగు పడింది. దాంతో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. మార్చ్ 31 వరకూ సినిమా రిలీజ్ లు ఉండవు. తర్వాత అనుమతించినా కానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కొంత కాలం జంకుతారు కాబట్టి మాస్టర్ రిలీజ్ ను జూన్ లేదా జులై కు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో కూడా మాస్టర్ చిత్రానికి భారీ రేటు పలికింది. విజిల్ చిత్రానికి వచ్చిన దానికంటే ఎక్కువ ప్రైస్ పెట్టి విజిల్ ను కొన్న నిర్మాతే ఈ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసాడు. మరి ఈ వాయిదా విజయ్ ప్లాన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All