Homeటాప్ స్టోరీస్“కరోనా” ఉంటే మాకేంటి.? – “మాస్టర్” ఆడియో లాంచ్

“కరోనా” ఉంటే మాకేంటి.? – “మాస్టర్” ఆడియో లాంచ్

“కరోనా” ఉంటే మాకేంటి.? – “మాస్టర్” ఆడియో లాంచ్
“కరోనా” ఉంటే మాకేంటి.? – “మాస్టర్” ఆడియో లాంచ్

కరోనా వైరస్ వ్యాపించకుండా ఈనెల అనగా మార్చ్ 31 వరకూ అని రకాల సభలు, సమావేశాలు, వేడుకలు, ఈవెంట్ లు, ఎగ్జిబిషన్ లు, ట్రేడ్ ఫెయిర్ లు, మీటింగ్ లు, అన్నీ వాయిదా వేసారు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్, లాంటి ఇతర ఈవెంట్ లకు భారీ సంఖ్యలో జనాలు వస్తారు. ఒకవేళ ఇండస్ట్రీ లో పెద్ద స్టార్స్ సినిమాలు అయితే, అదీ వాళ్ళు గత సినిమాలు భారీ హిట్ లు అయితే జనాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్ లు అయితే ఒకరి కి ఒకరు పోటాపోటీగా చేస్తున్నారు.

ఇక తమిళనాడులో అయితే అభిమానులు ధాటికి హాల్స్, రిసార్ట్స్ సరిపోక… డైరెక్ట్ స్టేడియాలలో ఈవెంట్ లు చెయ్యడం సర్వ సాధారణం అయిపోయింది. ఇక మొదటినుండి ఏదైనా కొంచెం “అతి”శయంగా ప్రవర్తించే అరవ తంబీలు ప్రతుతం కరోనా వైరస్ కి భయపడటం లేదు. ఇండియా వ్యాప్తంగా 84 నుండి 110 కు కరోనా వ్యాధిగ్రస్తులు చేరినా వాళ్ళకు ఏమీ పట్టడం లేదు. తాజాగా దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న “మాస్టర్” సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని పబ్లిక్ ఫంక్షన్ లా కాకుండా … కొద్దిమందితో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఏర్పాట్లు చేసారు.

- Advertisement -

కానీ తీర చూస్తే ఈవెంట్ చివరకి వచ్చేసరికి పోగైన జనాలను చూసి నిర్వాహకులు షాక్ అయ్యారు. ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేసిన ఆ ఈవెంట్ కి సైతం జనం భారీ సంఖ్యలో వచ్చారు. అది కూడా అందరూ డీసెంట్ క్రౌడ్. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ కి అంత హైప్ వచ్చేసింది. ఇక తన స్పీచ్ లో విజయ్… తన ఫ్రెండ్ అజిత్ లాగా ఈసారి మంచి డ్రెస్ వేసుకుని వచ్చానని చెప్పడంతో అటు “తాలా” ఫ్యాన్స్ కూడా యాక్టివ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో విజయ్ తన తల్లితో పాల్గొన్నారు. డ్యాన్స్ కూడా చేసి అభిమానులకు కిక్ ఇచ్చారు. మొత్తానికి కరోనా కి తమిళ్ తంబీలు ఏ మాత్రం భయపడటం లేదని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All