Homeటాప్ స్టోరీస్విజయ్ ప్రత్యర్ధులకు ఝలక్ ఇస్తున్న“మాస్టర్” ఫస్ట్ లుక్

విజయ్ ప్రత్యర్ధులకు ఝలక్ ఇస్తున్న“మాస్టర్” ఫస్ట్ లుక్

first look of Thalapathy Master in Telugu
first look of Thalapathy Master in Telugu

బిగిల్” సినిమా సూపర్ హిట్ తర్వాత దళపతి విజయ్ తన తర్వాతి సినిమా గా “మాస్టర్” ను రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. “బిగిల్” సినిమా తో పాటు సమాంతరంగా విడుదలై ఇండస్ట్రీ హిట్ సాధించిన “ఖైదీ” సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజు ఇప్పుడు మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి చిన్నపిల్లల స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నారు. ఇప్పటివరకూ యువత, మహిళలు మరియు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను తనకు వీరాభిమానులు గా చేసుకున్న విజయ్ ఈ సినిమాతో చిన్నపిల్లలకు కూడా ఒక మంచి సూపర్ హీరో అవడం గ్యారెంటీ అనిపిస్తోంది.

- Advertisement -

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కంపోజ్ చేస్తున్న సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన “కుట్టి స్టోరీ” పాటతో పాటు ఊర మాస్ బీట్ తో రిలీజ్ అయిన “వాతీ కమింగ్” సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

ప్రస్తుతం తమిళనాడు లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, వచ్చే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండటంతో దానికి సంబంధించిన రిఫరెన్స్ లు కూడా డైలాగుల రూపంలో ఈ సినిమాలో ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో తల పట్టుకొని అసహనంతో మరియు ఆలోచనతో కనిపిస్తున్న విజయ్ ఇంటర్ కట్ లో, గట్టి హీరోయిజం ఎలివేషన్ ఉన్న లుక్ కూడా యాడ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పక్కకు పిల్లిని ఎత్తి పట్టుకున్న మరొక కాన్సెప్ట్ ని కూడా ఆడ్ చేశారు.

ఇటీవల భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో విజయ్ పై ఐటి దాడులు జరుగుతున్నాయని.. తమ హీరోను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని కొంతమంది విజయ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో “తనను ఎక్కువగా రెచ్చగొట్టొద్దు..!” అని తనను ఎంతగా ఇబ్బంది పెడుతున్నా.. “సహనంతో ఉన్నాను..!” అనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా విజయ్ చెప్తున్నాడు అని కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్టోరీగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ కు ప్రతినాయకుడిగా “మక్కల్ సెల్వన్” విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారెంటీ.! అని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All