Homeటాప్ స్టోరీస్బిగిల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

బిగిల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

బిగిల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్
బిగిల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

దీపావళికి ఒక రోజు ముందుగానే కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల పాటసులు గట్టిగా పేలతాయని అర్ధమవుతోంది. బిగిల్ సినిమా హడావుడి మాములుగా లేదు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెరుగుతోంది. దానికి తోడు చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ కూడా మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. చూస్తుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ సౌత్ లో ట్రెండ్ సెట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది.

ఇక సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీక్ బిజినెస్ విషయానికి వస్తే.. 136.55కోట్లకు చేరింది. అత్యదికంగా తమిళనాడులో  సినిమా బిజినెస్ 83.55కోట్లు ఉండగా.. ఇక ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలో 10కోట్ల ధర పలికింది. కేరళ 3.5కోట్లు – కర్ణాటక 8.5కోట్లు – ఓవర్సీస్ 30కోట్లు – రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1కోటి వద్ద సినిమా థియేట్రికల్ వాల్యూ కలిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంటర్వ్యూలో సినిమాను 180కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు చిత్ర నిర్మాత తెలియజేశారు. మరి సినిమా ఏ స్థాయిలో లబాల్ని అందిస్తుందో చూడాలి.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా ఏ ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. స్పోర్క్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సినిమాను తెరకెక్కించినట్లు ఇటీవల ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. రెహమాన్ పాటలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ్ లో ఓకేసారి రిలీజ్ కాబోతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All