
నాని నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ `నిన్ను కోరి`. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ ఆ తరువాత చేసిన `మజిలి`తో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తున్నాడు. `టక్ జగదీష్` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వాయిదా వేశారు.
రోజు రోజుకీ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. రాష్ట్రాలు కూడా కేంద్రం చెప్పినట్టుగానే లాక్ డౌన్‌ని ప్రకటించి అన్నింటినీ బంద్ చేశాయి. కఠినంగా బంద్ పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హోచ్చరికలు జారీ చేసింది. దీంతో సినిమా షూటింగ్‌లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ అన్నీ బంద్ చేశారు. షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఎవరికి వారు ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కంటిన్యూ అవుతుందని చెప్పడంతో ఈ సమయాన్ని ఎలా సద్వినయోగం చేసుకోవాలా అని అంతా ఆలోచిస్తున్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాత్రం ఈ సమాయాన్ని బాగానే వాడుకుంటున్నాడట. ఈ సమయాన్ని ఓ అద్భుతమైన సిట్యవేషనల్ సాంగ్‌కి అంకురార్పణకు వాడుతున్నారట. నాని కోసం మూవీలో ఓ పాట రాస్తున్నట్టు శివ నిర్వాణ వెల్లడించారు.