Homeటాప్ స్టోరీస్ఆర్మీ ఆఫీసర్ లుగా అదరగొట్టిన మన తెలుగు హీరోలు

ఆర్మీ ఆఫీసర్ లుగా అదరగొట్టిన మన తెలుగు హీరోలు

ఆర్మీ ఆఫీసర్ లుగా అదరగొట్టిన మన తెలుగు హీరోలు
ఆర్మీ ఆఫీసర్ లుగా అదరగొట్టిన మన తెలుగు హీరోలు

నేరుగా విషయానికి వస్తే, తెలుగు సినిమాలో కానీ, లేదా భారతీయ బాషలలో మన దేశభక్తి అనే సబ్జెక్ట్ మీద అనేక సినిమాలు వచ్చాయి. వీటిలో స్వాతంత్ర్య సమారా యోధుల బయోపిక్ లు, మిలటరీ ఆపరేషన్స్. చరిత్రలో జరిగిన అనేక సంఘటనలు ఇలా అనేక సబ్ క్యాటగిరీలు ఉన్నాయి. హాలీవుడ్ లాంటి చోట్ల కన్నా, మన దేశంలో ఎంతైనా ఈ జోనర్ లో అనేక సినిమాలు వచ్చాయి. ఇక ఈ సంవత్సరం మన దేశాన్ని ఒక ఊపు ఊపిన “ఉరి” – ద సర్జికల్ స్ట్రైక్ సినిమా అయితే ఈ ఫీవర్ ను ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఎంత పైకి శాంతి వచనాలు పలికినా, అమెరికా వాళ్ళ నుండి ఆఫ్ఘానిస్తాన్ దాకా యుద్ధం,హింస, రక్తపాతం చూసి ఉద్రేకం చెందటం మన డిఎన్ఎ లో ఉండిపోయింది.

టాలీవుడ్ లో నటరత్న ఎన్టీఆర్ చేసిన అనేక సినిమాలో బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్ ఆయన కెరియర్ లోనే చాలా ప్రత్యేకమైనవి. మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో మేజర్ గా మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ చేసారు.ఇక మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ కంచే సినిమాలో ; అల్లు అర్జున్ “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా” సినిమాలో సైనికుల పాత్రలో అటు బోర్డర్ లోనే కాదు, ఇటు సమజంలో ఉన్న రుగ్మతలను పరిష్కరించే హీరోలుగా కనిపించారు.

- Advertisement -

యువ సామ్రాట్ నాగార్జున ఆజాద్ అనే దేశభక్తి సినిమాలో కనిపించి, ఆ తరువాత చాలాకాలానికి “గగనం” అనే సినిమాలో పూర్తి స్థాయి మిలటరీ అధికారిగా నటించారు. ఆయన వారసుడు నాగ చైతన్య రీసెంట్ మూవీ వెంకీ మామ లో ఆర్మీ ఆఫీసర్ “కార్తీక్ శివరాం వీరమాచినేని” క్యారెక్టర్ లో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించినా అది హిట్ కాలేదు. ఇక చాలాకాలంగా హిట్ లేని రాజశేఖర్ పి.ఎస్.వి గరుడవేగ సినిమాలో ఈ తరహా పాత్రలో మెప్పించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుత టాలీవుడ్ సంచలనం అడివి శేష్ గూఢచారి హిట్ అవ్వడంతో ప్రస్తుతం 26/11 దాడుల నేపధ్యంలో వస్తున్న సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ “మేజర్” లో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు ఒకానొక నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. ఇక, మహేష్ తాజా చిత్రం సరిలేరు – నీకెవ్వరు సినిమాలో మేజర్ అజయ్ కృష్ణగా కనిపిస్తున్నాడు. ఇలాంటి ఫార్ములా తో చాణక్య సినిమా చేసిన గోపీచంద్ & ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చేసిన ఆది సాయి కుమార్ హిట్ అందుకోలేకపోయారు. ఒక్కటి మాత్రం నిజం – తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ సినిమాలకు కూడా, హీరో డామినేషన్ అనే జాడ్యం వదలడం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All