Homeగాసిప్స్మహేష్ బాబు రెమ్యునరేషన్ కోటలు దాటుతోందిగా!

మహేష్ బాబు రెమ్యునరేషన్ కోటలు దాటుతోందిగా!

మహేష్ బాబు రెమ్యునరేషన్ కోటలు దాటుతోందిగా!
మహేష్ బాబు రెమ్యునరేషన్ కోటలు దాటుతోందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యునరేషన్స్ ఒక పరిధిని దాటి వెళ్లిపోతున్న విషయంపై ఇప్పటికే నిర్మాతల దగ్గరనుండి ట్రేడ్ పండితుల వరకూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. సినిమా బడ్జెట్ లో దాదాపు 60 శాతం రెమ్యునరేషన్స్ కే వెళ్ళిపోతున్నాయన్న వార్త బాగా వ్యాప్తి చెందడంతో హీరోలు కొత్త రూటే పట్టారు. అసలు తమకు రెమ్యునరేషన్ వద్దు అంటున్నారు. అలా అని ఫ్రీ గా ఏం చేయరుగా. రెమ్యునరేషన్ బదులు సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కుదిరితే రెండూ, ఇంకా పనవుతుంది అనుకుంటే హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్ని రకాలుగా తమ రేంజ్ ను బట్టి రాయించేసుకుంటున్నారు. నిజానికి ఈ పద్దతే బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు రెమ్యునరేషన్ పెరిగిపోతోందన్న గొడవ లేదు, పైగా రెమ్యునరేషన్ కన్నా భారీ మొత్తాలు ఈ రైట్స్ తీసుకోవడం వల్ల అందుకోవడానికి కుదురుతుంది.

అయితే నిర్మాతల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది. రెమ్యునరేషన్ ఎక్కువని గొడవ చేస్తే అది తగ్గించుకోవాలి కానీ ఇలా రైట్స్ అంటూ నిర్మాతల జేబులో డబ్బు గుల్ల చేస్తే ఎలా అని లబోదిబోమంటున్నారు. అయితే టాప్ హీరోలు కాబట్టి బయటకు ఏమి అనలేని పరిస్థితి. ఈ రైట్స్ విషయంలో అందరికంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే దాదాపు 40 కోట్ల రూపాయల వరకూ మహేష్ కు ముడుతోందిట. అయితే ఇది రెమ్యునరేషన్ లెక్క కాదు కాబట్టి సినిమాపై భారం పడదు. తమ ఫేస్ మీదే సినిమాకు బిజినెస్ అవుతుంది కాబట్టి ఈ మాత్రం పుచ్చుకోవచ్చు అన్న ధోరణి స్టార్ హీరోల్లో ఎక్కువవుతోంది.

- Advertisement -

మహేష్ విషయమే తీసుకుంటే మహర్షికి దాదాపు 25 కోట్లు తీసుకున్న మహేష్ ఈసారి మరో 15 కోట్లు ఎక్కువ అందుకోనున్నాడు. సరిలేరు నీకెవ్వరు కు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ మహేష్ కే పట్టం కట్టేసారు. సాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 30 కోట్లు వచ్చాయి. అలాగే హిందీ డబ్బింగ్ హక్కుల కింద 15 కోట్లు వచ్చాయి. మ్యూజికల్ రైట్స్ కింద మరో కోటి వచ్చినట్లు సమాచారం. ఇక అన్ని టాక్స్ లు తీసేస్తే మహేష్ కు దాదాపు 40 కోట్లు ముడుతున్నాయిట.

ఈ లెక్కన సరిలేరు నిర్మాత అనిల్ సుంకరకు పెద్ద ఏం మిగలట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే నామ మాత్రపు ప్రాఫిట్స్ కు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేసాడు. పైగా ప్రాఫిట్స్ లో దిల్ రాజుకు వాటా ఇవ్వాలి. ఈ సినిమాకు సైలెంట్ పార్ట్నర్ దిల్ రాజే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All