Homeగాసిప్స్అల్లు అర్జున్ బ్లాక్ మ్యాజిక్ ఓ లుక్కేసారా?

అల్లు అర్జున్ బ్లాక్ మ్యాజిక్ ఓ లుక్కేసారా?

అల్లు అర్జున్ బ్లాక్ మ్యాజిక్ ఓ లుక్కేసారా?
అల్లు అర్జున్ బ్లాక్ మ్యాజిక్ ఓ లుక్కేసారా?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం కార‌ణంగా ప్ర‌పంచం న‌లుమూల‌ల్లో ఏది జ‌రిగినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతోంది. ప్ర‌పంచం మొత్తం పాకేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆడియ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేసి థియేట‌ర్‌కు ర‌ప్పించ‌డం కోసం స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు కొత్త‌గా ట్రై చేస్తున్నారు. కొత్త‌ద‌నాన్ని చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. సినిమాలో పాత్ర ఏదైనా చొక్కా న‌ల‌గ‌కుండా స్టైలిష్ మేక‌ప్‌తో క‌నిపించే హీరోలు ఇప్పుడు మెట్టుదిగుతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు పాత్ర ప‌రంగా ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ఈ మ‌ధ్య బాలీవుడ్‌లో వ‌చ్చిన `సూప‌ర్ 30`, `గ‌ల్లీబాయ్‌` ఈ విష‌యాన్ని రుజువు చేశాయి.

ఈ రెండు చిత్రాల్లోనూ హృతిక్ రోష‌న్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ డీ గ్లామ‌ర్ లుక్‌తో క‌నిపించారు. అలా క‌నిపించ‌డానికి వారు వేసుకున్న బ్లాక్ మేక‌పే కార‌ణం. పాత్ర స‌హ‌జంగా స్క్రీన్‌పై క‌నిపించాల‌ని హృతిక్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ చేసిన ప్ర‌యోగం ఫ‌లించడంతో `సూప‌ర్ 30, గ‌ల్లీబాయ్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు వీరిద్ద‌రిని అల్లువార‌బ్బాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోఅవుతున్నాడు. `అల వైకుంఠ‌పురంలో` సినిమా కోసం అల్లు అర్జున్ త‌న పాత్ర మాసీవ్‌గా వుంటుంది కాబ‌ట్టి తెర‌పై ఆ ఫ్లేవ‌ర్ క‌నిపించాలంటే త‌ను మాస్‌గా, కొంత క‌లర్ త‌గ్గి క‌నిపించాలని భావించి త‌న స్కిన్ టోన్‌కి భిన్నంగా బ్లాక్ మేక‌ప్‌ని ఉప‌యోగించిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో అది స్ప‌ష్టంగా క‌నిపించింది. స‌ముద్ర‌ఖ‌నితో `మీరిప్పుడే కారు దిగారు..నేనిప్పుడు క్యారెక్ట‌ర్ ఎక్కేశా..` అని చెప్పే స‌న్నివేశాల్లోనూ, సుశాంత్‌తో క‌లిసి వున్న స‌న్నివేశాల్లోనూ..టీజ‌ర్ చివ‌ర‌న కోడి పుంజుని ప‌ట్టుకుని బీడీ కాలుస్తున్న స‌న్నివేశంలోనూ బ‌న్నీ మేక‌ప్ బ్లాక్ వున్న‌ట్టు క‌నిపించింది. టాలీవుడ్‌లో వున్న స్టార్ హీరోల్లో ఇలా పాత్ర కోసం బ్లాక్ మేక‌ప్ వేసుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. సంక్రాంతికి బ‌రిలోకి దిగుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్లాక్ మ్యాజిక్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All