Homeటాప్ స్టోరీస్కరోనాను కట్టడి చేసిన తెలుగు వైద్యుడు – డా. నాగరాజు

కరోనాను కట్టడి చేసిన తెలుగు వైద్యుడు – డా. నాగరాజు

కరోనాను కట్టడి చేసిన తెలుగు వైద్యుడు – డా. నాగరాజు
కరోనాను కట్టడి చేసిన తెలుగు వైద్యుడు – డా. నాగరాజు

గతంలో సూర్య హీరోగా నటించిన “7th సెన్స్” సినిమా కథలో భాగంగా భారతీయ రాజు బోధి ధర్ముడు అప్పట్లో చీనా దేశానికి వెళ్లి అక్కడ అనుకోని వ్యాధితో బాధ పడుతున్న చైనా ప్రజలను బాగు చేసి వారికి ఆయుర్వేదం, ఆత్మరక్షణ విద్యలు నేర్పించి నేర్పించి అక్కడే “మాస్టర్ దామో” గా స్థిరపడ్డాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఒక భారతీయ డాక్టర్ చేసినటువంటి ఒక ప్రయత్నం “7th సెన్స్” సినిమాని తలపిస్తోంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాక్టర్ నాగరాజు. నాగరాజు గారు తెలుగు వ్యక్తి అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లో ఉంటారు. ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో డాక్టర్ నాగరాజు గారు ముఖ్యంగా కరోనా వైరస్ అత్యధికంగా వ్యాపించిన ఊహాన్ నగరానికి వెళ్ళి అక్కడ కరోనా వైరస్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించి…  ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొంచెం మెరుగైన నేపథ్యంలో ఒక స్పెషల్ విమానంలో మళ్లీ వాషింగ్టన్ కు చేరుకున్నారు. చైనా దేశ వ్యాప్తంగా ముఖ్యంగా వూహాన్ నగరంలో ఉండే ప్రజలు నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

- Advertisement -

 మన దేశ ప్రతిభ మన కన్నా పక్క దేశం వాళ్లకి ఉపయోగపడటం కొంత విచారకరమైన విషయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరూ రక్షించబడినా.. అది మంచిదే, కానీ నాగరాజు గారి లాంటి ఎందరో డాక్టర్లను ముఖ్యంగా మన దేశానికి చెందిన మన తెలుగువారు అయినటువంటి డాక్టర్లను ప్రపంచవ్యాప్తంగా సంప్రదించి… మన ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కరోనా వైరస్ ఇంకా ప్రబలకుండా వారి సలహాలు సూచనలు వారి సేవలు ఉపయోగించుకొని మనం ఈ సమస్యని ఎదుర్కోవడమే ఉత్తమమైన మార్గం. మన దేశ ప్రస్తుత ప్రభుత్వాలు నాగరాజు గారు ఇలాంటి డాక్టర్లను ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ మందిని సంప్రదిస్తే….   మనకు మన ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. తాజాగా ఈ పోస్ట్ ను ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ గారు తన సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All