ప్రముఖ రచయిత కోనవెంకట్ తన పై అత్యాచారం చేసాడని నిన్న సంచలన ఆరోపణలు చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . బంజారాహిల్స్ లోని ఓ గెస్ట్ హౌజ్ కి నన్ను పిలిచాడు , మద్యం తాగుతావా అంటూ ఆఫర్ ఇచ్చాడు నేను వద్దు నాకు అలవాటు లేదని చెప్పాను కానీ నా మాట వినిపించుకోకుండా నన్ను రేప్ చేసాడు అంటూ చెప్పి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి .
అయితే శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు అంతా అవాస్తవమని అసలు ఆమెతో పరిచయం లేదని కానీ నన్ను అనవసరంగా ఎందుకు టార్గెట్ చేసిందో అర్ధం కావడం లేదని ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు కోన వెంకట్ . అంతేకాదు వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు కూడా . ఒకవైపు శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ పలువురు సెలబ్రిటీ లను రోడ్డు కీడ్చుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఏమి చేయాలో తెలీక కుమిలిపోతున్నారు .