Homeటాప్ స్టోరీస్దసరా సీజన్ ను ముందుగానే బుక్ చేసేసుకున్నాడే!

దసరా సీజన్ ను ముందుగానే బుక్ చేసేసుకున్నాడే!

దసరా సీజన్ ను ముందుగానే బుక్ చేసేసుకున్నాడే!
దసరా సీజన్ ను ముందుగానే బుక్ చేసేసుకున్నాడే!

ఎలాంటి సినిమాకైనా, అది ఎంత రేంజ్ ది అయినా సరే రిలీజ్ టైమింగ్ అనేది చాలా ముఖ్యం. సరైన సమయంలో రిలీజ్ చేయగలిగితే యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అదే రిలీజ్ టైమింగ్ కుదరకపోతే హిట్ కంటెంట్ ఉన్నా యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మన దర్శక నిర్మాతల ఎక్కువగా పండగ రోజుల కోసం చూస్తుంటారు. ఆ సమయంలో అయితే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తారనేది వారి నమ్మకం. తెలుగు వాళ్ళ వరకూ సినిమాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి, తర్వాత వేసవి సినిమాలకు బాగా కలిసొస్తుంది. ఇక ఈ రెండిటి తర్వాత దసరా సీజన్ కు సినిమాలకు పండగే.

ఈసారి సంక్రాంతికి జరిగిన హంగామా మనందరం చూసాం. అయితే వేసవి మాత్రం కొంత డల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమాల రిలీజ్ ల విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోవడం ఒక కారణమైతే కరోనా భయం ప్రజల్లో నాటుకుపోవడం మరో కారణం. ఇక దసరా సీజన్ కు ఇంకా తెలుగు సినిమాలు ఏవీ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోలేదు.

- Advertisement -

నిజానికి ఈసారి దసరాను పలు సినిమాలు టార్గెట్ చేసాయి. లాస్ట్ దసరాకు తన సినిమాను విడుదల చేసుకున్న చిరంజీవి ఈసారి కూడా దసరాకు వస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఉంది. అయితే కుదిరితే ముందే వద్దామనుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ మూవీ కూడా కుదిరితే దసరాకు లేదా ఇంకొంచెం వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా మూవీ కూడా దసరాకే ఫిక్స్ అయింది. అయితే ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు.

ఇవన్నీ జరిగేలోపు కన్నడ సినిమా కేజిఎఫ్ 2 తమ రిలీజ్ డేట్ ను దసరాకు ఫిక్స్ చేసుకుంది. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ మార్చే అవకాశమే లేదు. సో ఈసారి దసరా సీజన్ ను డబ్బింగ్ సినిమాతో పంచుకోవాల్సి వస్తుంది. పోటీగా తెలుగు వరకూ స్ట్రైట్ సినిమా విడుదలైనా బయట కేజిఎఫ్ తో పోటీ తప్పకపోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All