
టాలీవుడ్ నటుడు శివాజీ అమెరికా వెళ్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయడం లేదు అంటూ విడుదల చేసారు .ఆపరేషన్ గరుడ అంటూ మీడియాలో సంచలనం సృష్టించాడు శివాజీ . గతకొంత కాలంగా సినిమాలు మానేసి రాజకీయా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు శివాజీ .
అయితే టివి 9 క్రయవిక్రయాల్లో మాజీ సి ఈ ఓ రవిప్రకాష్ తో కలిసి కుట్ర పన్నాడు అన్న ఆరోపణలతో అజ్ఞాతంలోకి వెళ్ళాడు శివాజీ దాంతో రెండు నెలలుగా శివాజీ కోసం తీవ్ర గాలింపు చేపట్టారు పోలీసులు . అయితే వాళ్ళ కన్నుగప్పి అమెరికా వెళ్ళడానికి సిద్ధం కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో శివాజీని అదుపులోకి తీసుకున్నారు . అయితే అరెస్ట్ చేయకుండా పలురకాల ప్రశ్నలు వేసి నోటీసులు ఇచ్చి మళ్ళీ ఈనెల 11 న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు . దాంతో శివాజీ ఇంటికి వెళ్ళిపోయాడు .