Homeటాప్ స్టోరీస్తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం!

తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం!

తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం!
తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం!

రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న క‌రోనా బాదితుల‌కు వారి ఇళ్ల‌కే `ఐసోలేష‌న్‌` కిట్‌ల‌ని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆ స‌మ‌యంలో చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, మాస్క్‌లు, శానిటైజ‌ర్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. కోఠీలోని వైద్యారోగ్య కార్యాల‌యంలో వైద్య ఆ‌రోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఈమేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ముందు ముందు కేసుల తీవ్ర‌త పెరుగుతుంద‌నే ఆందోళ‌న నెల‌కొన‌డంతో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో వుంచుకుని దృష్టిలో వుంచుకుని కిట్ల‌ను అందుబాటులో వుంచుకోవాల‌ని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణ‌యించింది. బాధితుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడ‌నే స‌మాచారాన్ని వైద్యాధికారులు నిర్ణ‌యించుకోగానే స‌మీప ప్ర‌భుత్వ ఆసుప‌త్రి నుంచి కిట్ల‌ను నేరుగా వైద్య సిబ్బంది బాదితుని ఇంటికెళ్లి అంద‌జేస్తుంది. ఇంట్లో ఒక‌రి కంటే ఎక్కువ మంది ఉన్నా స‌రే బాధితులంద‌రికీ కిట్ల‌ని ఇస్తారు. నిత్యం వైద్య సిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆరోగ్య స‌మాచారాన్ని తెలుసుకుంటుంది. ఇలా ప్ర‌భుత్వం బాధితుల‌కు బాస‌ట‌గా నిల‌వ‌నుంది.

- Advertisement -

కిట్‌లో ఏముంటాయి?

శానిటైజ‌ర్లు, మాస్కులు, గ్లౌజులు
హైడ్రాక్సీక్లోరోక్విన్‌
పారాసిట‌మాల్
యాంటీ బ‌యాటిక్స్‌
విట‌మిన్ సి, ఇ, డి3 త‌దిత‌రాలు
లివో  సిట్ర‌జిన్‌
ఎసీడిటీని త‌గ్గించే మాత్ర‌లు
ఏం చేయాలి?.. ఏం చేయ‌కూడ‌దు? అనే అవ‌గాహ‌న పెంపొందించే బుక్‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All