Homeటాప్ స్టోరీస్తెలంగాణ‌లో 65కు చేరిన క‌రోనా కేసులు!

తెలంగాణ‌లో 65కు చేరిన క‌రోనా కేసులు!

 

65 Corona positive cases in Telanaga
65 Corona positive cases in Telanaga

తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మ‌రో 6 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో క‌రోనా వైర‌స్ సోకిన వారి సంక్ష 65కు చేరింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ శ‌నివారం వెల్ల‌డించారు. నిన్నా, ఈ రోజు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మంల కోసం కుద్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఢిల్లీ వెళ్లాడు. అత‌ను తిరిగి జ్వ‌రంతో వ‌చ్చాడు. కానీ ఆ విష‌యాన్ని దాచిపెట్ట‌డంతో అత‌ని కుటుంబానికి క‌రోనా సోకింది అన్నారు.

- Advertisement -

స‌మాచారం తెలుసుకున్న పోలీసులు అత‌నితో పాటు అత‌ని మొత్తం కుటుంబాన్ని క్వారెంటైన్‌కి త‌ర‌లించారు. ఇలాంటి వారంద‌రికి ఒక‌టే చెబుతున్నా ద‌య‌చేసి ఆరోగ్యం బాగాలేన‌ప్పుడు ఆ వివ‌రాలుమాకు వెల్ల‌డించండి. మీతో పాటు మీ కుటుంబాన్నే కాదు..స‌మాజాన్ని కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. ఈ రోజు న‌మోదైన ఆరు కేసుల‌కు ట్రావెల్ హిస్ట‌రీ వుంది. ఎవ‌రైనా చ‌నిపోతే స‌మాచారం ఇవ్వాల‌ని ఆసుప‌త్రుల‌కు ఆదేశాలు జారీ చేశాంస అన్నారు.

మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తీ ఒక్క‌రికి వుంది. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో కాదు. అది ఇంటికే ప‌రిమితం అయితే మంచిది. ద‌య‌చేసి ప‌రిస్థితిని అర్థం చేసుకుని స‌హ‌క‌రించండి. క్వారెంటైన్‌ల‌లో వున్న వాళ్లు బ‌య‌ట తిరిగితే వారిని పోలీసులు జైలుకు పంపుతారు. విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తులు బాధ్య‌తాయుతంగా వుండండి. ఎలాంటి ప‌రిస్థితుల్నైనా ఎదుర్కోవ‌డానికి తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ సిద్ధంగా వుంది. హైద‌రాబాద్‌లో రెడ్ జోన్లు ఎక్క‌డా లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు క్వారెంటైన్ల‌లో 13 వేల మంది వున్నారు` అని తెలిపారు వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All