Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా రివ్యూ

టాక్సీ వాలా రివ్యూ

taxiwaala movie review
టాక్సీ వాలా రివ్యూ

టాక్సీ వాలా రివ్యూ :
నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్
సంగీతం : జేక్స్
నిర్మాణం : యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2
దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యాన్
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018

గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన హీరో విజయ్ దేవరకొండ . నోటా వంటి ప్లాప్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రం టాక్సీ వాలా దాంతో ఈ సినిమా హిట్ అవుతుందేమో అన్న ఆశలో ఉన్నారు ప్రేక్షకులు . మరి ప్రేక్షకుల ఆశలకు తగ్గట్లుగా టాక్సీ వాలా చిత్రం రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

కథ :

- Advertisement -

ఒకరి కింద జాబ్ చేయడం ఇష్టంలేని శివ (విజయ్ దేవరకొండ ) ఓ క్యాబ్ కొనుక్కొని కొత్త జీవితం ప్రారంభిస్తాడు . పాత కారుని కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ కం ఓనర్ గా మారిన తర్వాత తన క్యాబ్ లో దెయ్యం ఉందని తెలుసుకుంటాడు శివ . తన క్యాబ్ లో ప్రయాణిస్తున్న వాళ్ళని దెయ్యం టార్గెట్ చేస్తుండటంతో అసలు తన కారులో ఉన్న దెయ్యం ఎవరు ? ఎందుకు తన టాక్సీ లో ప్రయాణిస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తోందో తెలుసుకొని షాక్ అవుతాడు శివ ? అసలు దెయ్యం ఎవరు ? ఎందుకు శివ టాక్సీ ఎక్కిన వాళ్ళని టార్గెట్ చేస్తోంది ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ దేవరకొండ
ఫస్టాఫ్
ఎంటర్ టైన్ మెంట్
కాన్సెప్ట్
మాళవిక నాయర్
ప్రియాంక జవాల్కర్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్
స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :

విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో కట్టిపడేసిన విజయ్ కామెడీ సీన్స్ లో అయితే తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించాడు . అలాగే ప్రియాంక తో విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది . ప్రియాంక జవాల్కర్ లుక్స్ తో ఆకట్టుకుంది అలాగే ఉన్నంతలో నటన పరంగా కూడా ప్రత్యేకత చాటుకుంది . ఇక మలయాళ భామ మాళవిక నాయర్ కీలక పాత్రలో మెప్పించింది . హీరో ఫ్రెండ్ గా నటించిన విష్ణు బాగా నటించాడు . మొదటి చిత్రమే అయినప్పటికీ విజయ్ దేవరకొండ నమ్మకాన్ని వమ్ము చేయలేదు .

సాంకేతిక నిపుణులు :

యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి , అయితే గ్రాఫిక్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేవు . నేపథ్య సంగీతం తో అలరించాడు జేక్స్ . విజువల్స్ బాగున్నాయి ఇక దర్శకుడు రాహుల్ విషయానికి వస్తే మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ ఫస్టాఫ్ ని బాగానే రక్తి కట్టించినప్పటికీ ……. సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు . స్లో నెరేషన్ , అనవసరమైన సీన్స్ తో ప్రేక్షకులను అసహనానికి గురిచేశాడు . సెకండాఫ్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే తప్పకుండా టాక్సీ వాలా మరో రేంజ్ లో ఉండేది .

ఓవరాల్ గా :

విజయ్ దేవరకొండ కోసం , కాన్సెప్ట్ కోసం ఓసారి తప్పకుండా చూడొచ్చు

English Title: taxiwaala movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All