Homeటాప్ స్టోరీస్భారీ నష్టాలను చవిచూసిన విజయ్ దేవరకొండ నోటా

భారీ నష్టాలను చవిచూసిన విజయ్ దేవరకొండ నోటా

Vijay devarakonda's NOTA Closing Collections Disasterవిజయ్ దేవరకొండ మీద ఉన్న క్రేజ్ కొద్దీ భారీ రేట్లకు కొన్నారు నోటా చిత్రాన్ని . కేవలం 13 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 30 కోట్లకు అమ్ముకున్నారు అయితే పట్టుమని పది కోట్లు కూడా రాబట్టలేకపోయింది నోటా చిత్రం . దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 9. 80 కోట్ల వసూళ్ళ ని మాత్రమే రాబట్టింది నోటా చిత్రం . అక్టోబర్ 5 న తెలుగు , తమిళ బాషలలో విడుదల అయ్యింది నోటా చిత్రం . ఆగస్ట్ లో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం విడుదల అయి ప్రభంజనం సృష్టించడంతో వసూళ్ళ సునామి మొదలయ్యింది . అగ్ర హీరోలకు సైతం వీలు కానీ వంద కోట్ల క్లబ్ లో చేరాడు విజయ్ దేవరకొండ . దాంతో నోటా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దాన్ని క్యాష్ చేసుకున్నారు ఆ చిత్ర నిర్మాతలు .

విజయ్ దేవరకొండ మీద ఉన్న క్రేజ్ కొద్దీ నోటా చిత్రాన్ని కొనగా ఆ సినిమా దారుణంగా బయ్యర్లని మోసం చేసింది . ప్రేక్షకులు మెచ్చేలా సినిమా లేకపోవడంతో ఘోర పరాజయం పొందింది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఏంటి ? అన్నది ఈ వసూళ్ళ తో కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మొదట పెద్దగా అంచనాలు లేవు అయితే గీత గోవిందం పెద్ద హిట్ కావడం నోటా కు కలిసి వచ్చింది .

- Advertisement -

ఏరియాల వారీగా నోటా వసూళ్లు ఇలా ఉన్నాయి
తెలంగాణ – 3. 40 కోట్ల షేర్
సీడెడ్ – 1. 03 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర – 84 లక్షలు
ఈస్ట్ గోదావరి – 56 లక్షలు
వెస్ట్ గోదావరి – 35 లక్షలు
గుంటూరు – 65 లక్షలు
కృష్ణా – 52 లక్షలు
నెల్లూర్ – 33 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 80 లక్షలు
ఓవర్ సీస్ – 1. 32 కోట్లు
మొత్తం – 9. 80 కోట్ల షేర్

English Title: Vijay devarakonda’s NOTA Closing Collections : Disaster

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All