Homeటాప్ స్టోరీస్సైరా : భారీ ఓపెనింగ్స్ దిశగా సైరా ప్రీమియర్స్

సైరా : భారీ ఓపెనింగ్స్ దిశగా సైరా ప్రీమియర్స్

Syeraa US premier show collection details
Syeraa US premier show collection details

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే తొలి షోలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల మొదలవ్వగా చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముంబైలో ప్రీమియర్ షో వేసిన ప్రెస్ సైతం ఈ చిత్రం అదిరిపోయిందని కితాబిచ్చింది.

ఇక యూఎస్ లో భారీ ఎత్తున ఈ చిత్రం విడుదలైన సంగతి తెల్సిందే. భారతీయ కాలమానం ప్రకారం 12 గంటల నుండి యూఎస్ లో ప్రీమియర్స్ మొదలవుతాయి. యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నంబర్స్ ను నమోదు చేస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్రం 229 లొకేషన్స్ నుండి దాదాపు $516K వసూలు చేసింది.

- Advertisement -

ఈ ట్రెండ్ ను బట్టి సైరా కేవలం ప్రీమియర్స్ నుండే 1 మిలియన్ దాటి వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇదంతా మెగాస్టార్ క్రేజ్ అని చెప్పవచ్చు. పూర్తిగా పాజిటివ్ టాక్ కనుక సైరాకి వస్తే ఇక సైరా కలెక్షన్స్ ను ఊహించడం కూడా కష్టమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All