Homeటాప్ స్టోరీస్ప్రయోగాలు చిరంజీవి గారికి కలిసి వస్తాయా?

ప్రయోగాలు చిరంజీవి గారికి కలిసి వస్తాయా?

Chiranjeevi
Chiranjeevi

మెగా స్టార్ ‘చిరంజీవి’ గారు రేపు విడుదల అవుతున్న ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిర్మాత అయిన తన వారసుడు ‘రామ్ చరణ్‘ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో భారీగా నిర్మిస్తున్నారు. దర్శకుడు ‘సురేందర్ రెడ్డి’ కి బాధ్యతలు అప్పగించేశారు.

చిరంజీవి గారంటే సీనియర్ నటులు కాబట్టి ఇప్పటివరకు చేసిన మాస్ మాసాల, యూత్, ఫ్యామిలీ మూవీస్ వాటిలో విభిన్నంగా పాన్ ఇండియా  సినిమా తీస్తున్నాము అంటే చిరంజీవి  గారికి చాలానే అనుభవం ఉంటుంది. మరి దర్శకులు  సురేందర్ రెడ్డి కి మాత్రం ఇలాంటి పాన్ ఇండియా  సినిమా విషయంలో అస్సలు అనుభవం లేదు. ఇది వరకు చేసిన సినిమాలు అన్ని విబిన్నమైనవి. సైరా అనేది ఒక చరిత్రలాంటి సినిమా.

- Advertisement -

చిరంజీవి గారు కూడా ఇలాంటి ప్రయోగాలు ‘అంజి’, ‘రాజా విక్రమార్క’, ‘శ్రీ మంజునాథ’, ‘బిగ్ బాస్’, ‘హిట్లర్’, ‘రిక్షావోడు’ లాంటి సినిమాలు చిరంజీవి గారికి ప్రయోగాలు. అందులో ఒక్క సినిమా కూడా హిట్ లేదు. ఇంకా చెప్పుకుంటే చిరంజీవి గారి 152 సినిమాలలో కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. అవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినట్టు దాఖలాలు
లేవు.

ఇప్పుడు మెగా అభిమానులని కూడా ఈ ప్రశ్న బాగా ఇబ్బంది పెడుతుంది. కొందరేమో చిరంజీవి గారేమో ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు హిట్ కానప్పటికీ, సైరా తో హిట్ కొడతారు అంటే, ఇంకొంతమంది ప్రయోగాలు అచ్చు రాలేదు, అలాగే సురేందర్ రెడ్డి గారికి కూడా ఒక సినిమా హిట్టు, ఇంకొక సినిమా ఫ్లాప్ లాగ సాగిపోయే కెరీర్ లో ఇప్పుడు సైరా నెగటివ్ రెస్పాన్స్ లాగ మారింది అని అంటున్నారు.

నిజానికి సైరా విషయంలో రెగ్యులర్ సినిమా మీద పెట్టుకునే నమ్మకం కంటే ఎక్కువ ఉందని చెప్పాలి.  చూద్దాం మరి రేపు మొదటి ఆట చుసిన జనాలు ఏమని సమాధానం చెప్తారో…..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All