Homeటాప్ స్టోరీస్సైరా : ముంబై నుండి పాజిటివ్ రిపోర్ట్స్

సైరా : ముంబై నుండి పాజిటివ్ రిపోర్ట్స్

Syeraa gets positive reports from mumbai
Syeraa gets positive reports from mumbai

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్, మిగతా విదేశీ ప్రాంతాల నుండి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో మరియు హిందీలో విడుదలవుతున్న విషయం తెల్సిందే.

కొద్దిసేపటి క్రితం ముంబైలో ప్రెస్ కు, మీడియా వారికి సైరా ప్రీమియర్ వేయడం జరిగింది. దీనికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాదాపుగా అందరూ ఈ చిత్రం అద్భుతంగా ఉందని పొగిడేస్తున్నారు. దీన్ని ఒక విజువల్ వండర్ గా అభివర్ణిస్తున్నారు. అలాగే చిరంజీవి టెరిఫిక్ నటనను, సురేందర్ టేకింగ్ ను కొనియాడుతున్నారు.

- Advertisement -

ఇది కచ్చితంగా సైరా టీమ్ కు మంచి స్టార్ట్. మీడియా నుండి సపోర్ట్ వచ్చిందంటే అది హిందీ కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. మరికొద్ది గంటల్లో సైరా పూర్తి రివ్యూ కూడా వస్తుంది కాబట్టి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All