Homeటాప్ స్టోరీస్సైరా నరసింహారెడ్డి మూడు వారాల కలెక్షన్స్ - ఇక కష్టమే!

సైరా నరసింహారెడ్డి మూడు వారాల కలెక్షన్స్ – ఇక కష్టమే!

సైరా నరసింహారెడ్డి మూడు వారాల కలెక్షన్స్ - ఇక కష్టమే!
సైరా నరసింహారెడ్డి మూడు వారాల కలెక్షన్స్ – ఇక కష్టమే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై మూడు వారాలు పూర్తయింది. నేటి నుండి ఈ చిత్రం నాలుగో వారంలోకి అడుగుపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరు బయ్యర్లు లాభాల్లోకి అడుగుపెట్టగా బయట భారీ నష్టాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ లో ఈ చిత్రం భారీగా నష్టపోయింది. హిందీలో ఈ చిత్రానికి సరైన ప్రమోషన్స్ లేవు పైగా పోటీగా విడుదలైన వార్ చిత్రం అద్భుత కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఈ రెండు ఫ్యాక్టర్స్ వలన దాదాపు 15 కోట్ల వరకూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ కు నష్టం వచ్చింది.

సాధారణంగా కర్ణాటకలో మెగా హీరోల సినిమాలకు ఆదరణ ఎప్పుడూ బాగుంటుంది. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటే ఇక చెప్పుకోవాల్సిన పన్లేదు. అందుకే భారీ రేటుకు అక్కడి బయ్యర్ సినిమాను కొన్నాడు. కానీ దాదాపు 8 కోట్ల వరకూ నష్టపోయింది. ఇక ఓవర్సీస్ లో కూడా దాదాపు మిలియన్ డాలర్స్ వరకూ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ + తొలివారం కలెక్షన్స్ బాగున్నా ఆ తర్వాత నుండి వసూళ్ళలో డ్రాప్ కనిపించింది. ఇప్పటివరకూ ఓవర్సీస్ లో సైరా 2.6 మిలియన్ డాలర్స్ దాకా వసూలు చేసింది.

- Advertisement -

మళ్ళీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బాహుబలి తర్వాత తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా సైరా రికార్డు సృష్టించింది. మొదటి రెండు వారాలు సైరా తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోయింది. నైజాం, ఉత్తరాంధ్రల్లో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి. నైజాంలో 30 కోట్ల మార్క్ ను దాటిన రెండో సినిమాగా సైరా నిలిచింది. ఉత్తరాంధ్రలో సైతం 16 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ చిత్రాన్ని 14 కోట్లు పెట్టి కొన్నాడు డిస్ట్రిబ్యూటర్. ఇక సీడెడ్ లో 20 కోట్ల మార్క్ దిశగా సైరా పరుగులు తీస్తోంది.

మూడో వారం మొదట్లో సైరా కలెక్షన్స్ బాగుండడంతో ట్రేడ్ ఆశాజనకంగా కనిపించింది. అయితే మూడో వారం చివరికి వచ్చేసరికి కలెక్షన్స్ డల్ అయ్యాయి. వారాంతంలో పండగ ఉండడంతో కలెక్షన్స్ ఏమైనా పుంజుకుంటాయేమో చూడాలి. దీపావళికి రెండు సినిమాలు విడుదలవుతుండగా, రెండూ కూడా డబ్బింగ్ చిత్రాలే. సో, తెలుగు సినిమాకు వెళ్లాలనుకునేవారికి సైరా వన్ అండ్ ఓన్లీ ఛాయస్. దీపావళి సైరా ముందున్న ఆఖరి ఛాయస్. దీని తర్వాత సైరాకు నామమాత్రపు కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

మొత్తంగా చూసుకుంటే సైరా మూడు వారాలకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్లా లాభాల్లోకి అడుగుపెట్టగా మిగతా భాషల్లో మాత్రం ఫెయిల్ అయింది. సైరా మూడు వారాల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 32.49

సీడెడ్ 19.16

నెల్లూరు 4.52

కృష్ణ 7.48

గుంటూరు 9.61

వైజాగ్ 16.53

ఈస్ట్ 9.15

వెస్ట్ 6.57

మొత్తం 105.51

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All