మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి రెండు వారాలు పాటు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్ల కలెక్షన్స్ అందుకుని రికార్డు సృష్టించింది. అయితే 15వ రోజు నుండి సైరా పూర్తిగా నెమ్మదించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి 15వ రోజు కేవలం 60 లక్షల షేర్ రావడం బట్టి ఇక ఈ చిత్రం నెమ్మదించిందని అర్ధం చేసుకోవచ్చు.
ఇక వీకెండ్ ముందున్న నేపథ్యంలో ఆ రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కీలకం కానున్నాయి. వచ్చే సోమవారం నుండి సైరా నామమాత్రపు కలెక్షన్స్ అందిస్తుందని ట్రేడ్ ఊహిస్తోంది. 15 రోజుల సైరా కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇప్పుడు చూద్దాం.
ప్రాంతం షేర్ (కోట్లలో)
నైజాం 31.92
సీడెడ్ 18.76
నెల్లూరు 4.43
కృష్ణ 7.32
గుంటూరు 9.44
వైజాగ్ 15.89
ఈస్ట్ 8.96
వెస్ట్ 6.42
మొత్తం 103.14