Homeటాప్ స్టోరీస్చిరంజీవి సెంటిమెంట్ కార్తీకి కలిసొస్తుందా?

చిరంజీవి సెంటిమెంట్ కార్తీకి కలిసొస్తుందా?

చిరంజీవి సెంటిమెంట్ కార్తీకి కలిసొస్తుందా?
చిరంజీవి సెంటిమెంట్ కార్తీకి కలిసొస్తుందా?

తెలుగులో మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో కార్తీ ఒకరు. కెరీర్ మొదట్లోనే కార్తీకి ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఆవారా వంటి సినిమాలతో కార్తీ తెలుగు వారికి బాగా చేరువయ్యాడు. పైగా చాలా త్వరగా తెలుగు మాట్లాడడం నేర్చుకున్న కార్తీ ఇక్కడివారిని బానే బుట్టలో వేసుకున్నాడు. దాంతో కార్తీకి తెలుగులో ఆదరణ బాగా పెరిగింది.

ఒక సమయంలో అయితే తమిళ్ సినిమాకు అయిన బిజినెస్ కు సమాంతరంగా తెలుగులో కూడా అతని సినిమాలకు బిజినెస్ జరిగేది. అయితే అన్ని రోజులు మనవి కాదు అన్నట్లు కార్తీకి గడ్డు రోజులు మొదలయ్యాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా తన సినిమాలు ప్లాప్ అవడం మొదలయ్యాయి. దాంతో తెలుగులో క్రమంగా తన పట్టును కోల్పోయాడు కార్తీ.

- Advertisement -

మధ్యలో నాగార్జునతో చేసిన మల్టీస్టారర్ ఊపిరి తెలుగులో తనకి బాగానే హెల్ప్ అయింది. కానీ తెలుగు వారి టేస్ట్ కు దూరంగా కొన్ని సినిమాలు చేయడంతో అవి ఇక్కడ అంతలా విజయం సాధించలేదు. రీసెంట్ గా కార్తీ చేసిన దేవ్ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ దక్కలేదు. దీంతో తెలుగులో కార్తీ పనైపోయింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఖైదీతో తనకు ఇంకా తెలుగులో మార్కెట్ ఉందని నిరూపించుకుంటున్నారు.

ఖైదీ చిత్రాన్ని తెలుగులో రాధామోహన్ పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రానికి పోటీగా విజయ్ నటించిన విజిల్ ఉంది. కానీ తెలుగులో విజయ్ కంటే కార్తీ పెద్ద స్టార్. సో, ఖైదీ చిత్రానికే ఎక్కువ థియేటర్లు దక్కాయి. టీజర్, ట్రైలర్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తీ ఢిల్లీ అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ లేదు, పాటలు లేవు. కథ మొత్తం ఇంటెన్స్ గా ఉంటుందని అర్ధమవుతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే దీపావళి వరకూ వేచి చూడాలి.

ఇదిలా ఉంటే తమిళంలో ఖైదీ పేరుతో రూపొందిన ఈ చిత్రం, కథకు తగ్గ టైటిల్ కావడంతో తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతోంది. తెలుగులో ఖైదీకి ఉన్న గుర్తింపే వేరు. చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం కావడంతో మెగాస్టార్ అభిమానులు కూడా కార్తీ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి చిరంజీవి సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని కార్తీ ఆశపడుతున్నాడు. చిరంజీవి ఖైదీ 1983లో అక్టోబర్ 28న విడుదలైతే కార్తీ నటించిన ఖైదీ ఈ అక్టోబర్ 25న విడుదలవుతోంది. అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఒకే నెలలో విడుదలవుతుండడం కాకతాళీయమే అయినా ఈ సెంటిమెంట్ కలిసొచ్చి సినిమాకి ఆదరణ లభిస్తే కార్తీ మార్కెట్ మళ్ళీ తెలుగులో పుంజుకోవడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All