Homeటాప్ స్టోరీస్నాలుగు గంటల్లో జరిగే కథే ఖైదీ : కార్తీ

నాలుగు గంటల్లో జరిగే కథే ఖైదీ : కార్తీ

నాలుగు గంటల్లో జరిగే కథే ఖైదీ : కార్తీ
నాలుగు గంటల్లో జరిగే కథే ఖైదీ : కార్తీ

సినిమా కథేంటో సస్పెన్స్ గా ఉంచడం ఒక పద్దతి. ట్రైలర్ లో కూడా సినిమా కథ ఏంటనేది అర్ధం కాకుండా కట్ చేయిస్తుంటారు కొంత మంది దర్శకులు. సినిమా కథ మొత్తం ముందే చెప్పేసి దానికి తగ్గట్లుగా ప్రేక్షకులను రెడీ చేస్తుంటారు మరికొంత మంది. రెండిట్లోనూ దేనికుండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ దానికున్నాయి. తమిళ్ హీరో కార్తీ రెండో కోవకే చెందుతాడు. దీపావళికి విడుదల కానున్న తన తాజా చిత్రం ఖైదీ చిత్ర కథ గురించి ముందే చెప్పేసాడు కార్తీ.

పదేళ్ల పాటు జైల్లో గడిపివచ్చిన ఒక వ్యక్తి తన కూతుర్ని కలుసుకోవడానికి వెళ్తాడు. అయితే తనకి ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని సమస్యలు వస్తాయి. చివరికి అతను తన కూతుర్ని కలుసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ అంటూ కార్తీ ఖైదీ గురించి చెప్పాడు. ఈ చిత్రం నాలుగు గంటల్లో జరిగే కథ అని, దాన్ని రెండున్నర గంటల్లో చెప్పే ప్రయత్నం చేశామని, సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కార్తీ తన సినిమా మీద కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు.

- Advertisement -

ఈ దీపావళికి ఖైదీకి బలమైన ప్రత్యర్ధే బరిలో ఉంది. విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి తమిళంలో మొత్తం క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం కార్తీదే పైచేయి. ఇక్కడ విజయ్ కన్నా కార్తీ పాపులర్ స్టార్. ఈ నేపథ్యంలో ఖైదీకే ఎక్కువ థియేటర్లు కేటాయించబడ్డాయి. మరి ఖైదీ ద్వారా హిట్ కొట్టి మళ్ళీ తన కెరీర్ ను ట్రాక్ లో పెట్టుకుంటాడో లేదో చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All