Homeటాప్ స్టోరీస్కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్న సురేష్ బాబు
కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ సంస్థలు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి ముందుంటున్నాయి. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి సంస్థలు చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా కొత్త బ్యానర్ లు స్థాపించిన విషయం తెల్సిందే. ఈ బ్యానర్ ద్వారా సత్తా ఉన్న కథలను ప్రమోట్ చేస్తున్నారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు.

అగ్ర నిర్మాత సురేష్ బాబు శైలి దీనికి కొంచెం భిన్నంగా ఉంటుంది. తాను స్వయంగా చిన్న సినిమాలను నిర్మించకుండా, నిర్మాణం పూర్తైన చిత్రాలను చూసి నచ్చితే వాటిని తన బ్యానర్ ద్వారా విడుదల చేస్తాడు. ప్రస్తుతం దీనికి భిన్నంగా సురేష్ బాబు కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

- Advertisement -

నూతన దర్శకుడు సతీష్ ను సురేష్ బాబు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సతీష్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసుకున్నాడు. సతీష్ చెప్పిన కథ సురేష్ బాబుకు నచ్చడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All