Homeగాసిప్స్సురేష్ బాబు తనయుడి కోసం తేజ యాక్షన్ ఎంటర్టైనర్

సురేష్ బాబు తనయుడి కోసం తేజ యాక్షన్ ఎంటర్టైనర్

సురేష్ బాబు తనయుడి కోసం తేజ యాక్షన్ ఎంటర్టైనర్
సురేష్ బాబు తనయుడి కోసం తేజ యాక్షన్ ఎంటర్టైనర్

సురేష్ బాబు రెండో కొడుకు అభిరాం దగ్గుబాటి హీరోగా లాంచ్ అవ్వాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒక స్క్రిప్ట్ ను లాక్ చేసి ముహూర్తం కూడా జరిపారు కానీ వివిధ కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇప్పుడు అభిరాం దగ్గుబాటి డెబ్యూ మూవీ గురించి విశేషాలు బయటకు వస్తున్నాయి. తనదైన శైలి చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న తేజ అభిరాంను హీరోగా లాంచ్ చేయబోతున్నాడు.

నిజానికి తేజ చాలా చిత్రాలను ప్రకటించాడు. గోపీచంద్ హీరోగా ఒక సినిమా, రానా దగ్గుబాటితో మరో సినిమా, చిత్రం సీక్వెల్ గా చిత్రం 1.1 అలా కొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసాడు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ పక్కనపెట్టేసి ఇప్పుడు సురేష్ బాబుతో సినిమాకు ఫిక్స్ అయ్యాడు.

- Advertisement -

నిజానికి తేజ ఎప్పుడూ బౌండ్ స్క్రిప్ట్స్ పై నమ్మకం ఉంచడు. ఒక కథ అనుకుని దానికి షూటింగ్ స్పాట్ లో కూడా మార్పులు చేర్పులు చేస్తుంటాడు కానీ ఈసారి తన పంథా మార్చాడు. అభిరాం కోసం పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసాడు. సురేష్ బాబు కూడా స్క్రిప్ట్ కు ఓకే చెప్పేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All