Homeటాప్ స్టోరీస్రాజమౌళి కూడా సురేష్ బాబు మాటే మాట్లాడుతున్నాడుగా

రాజమౌళి కూడా సురేష్ బాబు మాటే మాట్లాడుతున్నాడుగా

రాజమౌళి కూడా సురేష్ బాబు మాటే మాట్లాడుతున్నాడుగా
రాజమౌళి కూడా సురేష్ బాబు మాటే మాట్లాడుతున్నాడుగా

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సాధారణంగా జరిగే పనులు అన్నీ బంద్ అయ్యాయి. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూతబడ్డాయి. షూటింగ్ లు అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ముందు ఏప్రిల్ 14 వరకూ అన్న లాక్ డౌన్ ఇప్పుడు మే 3కి మార్చబడింది. మే 3కి అప్పటి పరిస్థితిని బట్టి అంచనా వేసి లాక్ డౌన్ ను కొనసాగించాలా లేక ఎత్తేయేలా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకవేళ లాక్ డౌన్ ను ఎత్తేసినా ఒకేసారి మొత్తం అనుమతించకుండా దశల వారీగా అమలయ్యేలా ప్రభుత్వం చూసుకునే అవకాశముంది.

మే 3కి లాక్ డౌన్ ను ఎత్తేసినా వెంటనే షూటింగ్ లకు అనుమతి రాదేమోనని ఇటీవలే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో ఆరేడు నెలలు సినిమాకు గడ్డు కాలమే నడుస్తుందని సురేష్ బాబు అంచనా వేసాడు. ఇక షూటింగ్ ల అనుమతి విషయం పక్కనపెడితే థియేటర్లు ఓపెన్ అవ్వడానికి కచ్చితంగా ఆరు నెలల సమయం పడుతుందని సురేష్ బాబు అన్నాడు.

- Advertisement -

ఇది విని సినిమా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒకట్రెండు నెలలు సినిమా విడుదల వాయిదా పడితేనే పరిస్థితి తలక్రిందులు అవుతోంది ఇక ఆరేడు నెలలు అంటే ఎలారా అనుకుంటున్నారు. ఇటీవలే ఒక టివి ఛానల్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, ఈ నష్టాల నుండి కోలుకోవడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశముందని జక్కన్న అభిప్రాయపడ్డాడు.

ఇక అదే ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని కన్ఫర్మ్  చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All