Homeటాప్ స్టోరీస్అయోధ్య రామజన్మ భూమి అంశంలో విడుదలైన తీర్పు

అయోధ్య రామజన్మ భూమి అంశంలో విడుదలైన తీర్పు

కలియుగంలో మళ్లీ గెలిచిన శ్రీరాముడు
కలియుగంలో మళ్లీ గెలిచిన శ్రీరాముడు

వివాదాస్పద అయోధ్య రామ జన్మభూమి వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. ఈ అంశం మీద సుదీర్ఘంగా వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, సాక్షాలు అన్నీ పరిశీలించి నటువంటి సర్వోత్తమ న్యాయస్థానం చివరికి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.

వివాదాస్పద భూమిని రామజన్మభూమి ట్రస్టుకు అప్పగించాలని, ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ భూమి రామ్ జన్మభూమి న్యాస్ కే చెందుతుందని సుప్రీంకోర్టు అంతిమంగా తీర్పు చెప్పింది. అయోధ్యలోని ఒక ఐదు ఎకరాలు సున్నీ బోర్డు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని సూచించింది అదేవిధంగా దేవాలయం నిర్మాణం పై కేంద్రం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని కూడా ఆదేశించింది. ఇక రామ జన్మభూమి పై ఇతర పిటిషన్లను అన్నిటినీ కొట్టేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All