Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ డ్రగ్స్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు

టాలీవుడ్ డ్రగ్స్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు

 supreme court directions centre drugs caseటాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . డ్రగ్స్ కేసులో హీరో రవితేజ , హీరోయిన్ ఛార్మి , దర్శకులు పూరి జగన్నాధ్ , తనీష్ , తరుణ్ , నందు , ముమైత్ ఖాన్ , సుబ్బరాజు ,నవదీప్ , శ్యామ్ కే నాయుడు తదితరులను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే . అప్పట్లో ఈకేసు సంచలనం సృష్టించింది . పలువురు సెలబ్రిటీ లను వరుసగా విడతల వారీగా పిలిచి దర్యాప్తు చేసారు వాళ్ళ అరెస్ట్ ఇక ఖాయమే ! అని అనుకున్నారు కేసులు పెడతారని అనుకున్నారు కట్ చేస్తే ……. ఆ కేసు అటకెక్కింది .

దాంతో ఓ టాలీవుడ్ నిర్మాత సుప్రీం కోర్టు ని ఆశ్రయించాడు . డ్రగ్స్ వల్ల సినిమారంగం మాత్రమే కాకుండా యువత కూడా పాడై పోతున్నారని అందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సుప్రీం ని ఆశ్రయించాడు . కేసు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది . డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో విధి విధానాలు రూపొందించాలని మల్లీ సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు .

- Advertisement -

డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి కానీ తదుపరి చర్యలు మాత్రం ప్రభుత్వం తీసుకోలేదు , ఇక ఇప్పుడేమో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి . అయితే డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇకపై డ్రగ్స్ వాడకం దారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది .

English Title:  supreme court directions centre drugs case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All