Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ లో మరో షాక్ సింగర్ మృతి

టాలీవుడ్ లో మరో షాక్ సింగర్ మృతి

senior singer k rani passed awayటాలీవుడ్ లో మరో షాకింగ్ న్యూస్ సింగర్ రాణి ( 75) మృతి చెందింది . ఈరోజు ఉదయం నటుడు వినోద్ మృతి చెందగా నిన్న రాత్రి సీనియర్ గాయని రాణి మృతి చెందింది . సంచలన విజయం సాధించిన మరుపురాని చిత్రం ” దేవదాస్ ” చిత్రంలో పేరుగాంచిన పాట
” అంతా బ్రాంతి యేనా ……. జీవితానా వెలుగింతేనా ” అన్న పాట పాడిన గాయని ఈ రాణి కావడం విశేషం . పలు సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడింది ఈ గాయని . దాదాపు 500 పాటలను ఒక్క తెలుగులోనే పాడిన సీనియర్ గాయని రాణి తెలుగు మాత్రమే కాకుండా తమిళ్ , కన్నడ , మలయాళీ , హిందీ , బెంగాలీ , సింహాల , ఉజ్జెక్ తదితర బాషలలో పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి .

1951 లో గాలివీటి సీతారామిరెడ్డి ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమయ్యింది రాణి . గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ గాయని హైదరాబాద్ లోని తన కూతురు విజయ నివాసంలో ఉంటోంది . అయితే నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు , గాయని రాణి మృతి వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాప సందేశాన్ని పంపించారు . రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది గాయని రాణి .

- Advertisement -

English Title: senior singer k rani passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All