Homeన్యూస్"మళ్లీ మొదలైంది"తో మరో హిట్ కొట్టిన సుమంత్

“మళ్లీ మొదలైంది”తో మరో హిట్ కొట్టిన సుమంత్

"మళ్లీ మొదలైంది"తో మరో హిట్ కొట్టిన సుమంత్
“మళ్లీ మొదలైంది”తో మరో హిట్ కొట్టిన సుమంత్

1999 లో ప్రేమ కథ చిత్రంతో హీరోగా పరిచయమైనా సుమంత్..మొదటి మూవీ తోనే చక్కటి విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత చేసిన యువకుడు పర్వాలేదు అనిపించుకోగా.. ఆ తర్వాత నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ తెచ్చింది.

మళ్ళీ కొన్ని ప్లాప్స్ తర్వాత, 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు.  2011 లో గోల్కొండ హై స్కూల్ హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది.  తర్వాత 2017 లో మళ్ళీ రావా అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఇక ఇలా హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు..మళ్లీ ఒక హిట్..మళ్లీ ప్లాప్ లు ఇలా సుమంత్ కెరియర్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తాజాగా మళ్లీ మొదలైంది అంటూ మరో హిట్ కొట్టాడు.

- Advertisement -

జీ5 లో నేరుగా స్ట్రీమింగ్ అయినా ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  ఫస్ట్ డే ఈ మూవీ ని 5 కోట్ల నిమిషాల పాటు నెటిజన్లు చూశారంటూ జీ5 అధికారిక ప్రకటన చేసింది.  స్ట్రీమింగ్ కు వచ్చిన రోజు నుంచి చూసుకుంటే.. జీ5కు సబ్ స్క్రైబర్లు తెలుగు మార్కెట్ నుంచి 2 లక్షల మందికి పైగా పెరిగారంట. ఈ లెక్కన చూసుకుంటే మళ్లీ మొదలైంది మంచి హిట్ అనే చెప్పాలి.ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించగా.. సుమంత్ – నైనా గంగూలీ జంటగా నటించారు. టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All