
`సైరా నరసింహారెడ్డి` వంటి చారిత్ర చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి మరో భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇ్పటి వరకు చిత్రీకరణ 40శాతం పూర్తయింది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్నారు. కీలక అతిథి పాత్రలో రామ్‌చరణ్ నటించబోతున్నారు. లాక్‌డౌన్ తరువాత దీనికి స
ంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ వుండే అవకాశం వుంది. ఇదిలా వుంటే సినిమా తరువాత చిరంజీవి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రానికి `సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం లాక్‌డౌన్ పిరియేడ్‌కావడంతో సుజీత్ మరిన్ని మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చివరలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురానున్నారట.