Homeఎక్స్ క్లూసివ్రవితేజ సినిమా అనౌన్స్ చేస్తే.. బెల్లంకొండ ఫస్ట్ లుక్ వదిలాడు

రవితేజ సినిమా అనౌన్స్ చేస్తే.. బెల్లంకొండ ఫస్ట్ లుక్ వదిలాడు

రవితేజ సినిమా అనౌన్స్ చేస్తే.. బెల్లంకొండ ఫస్ట్ లుక్ వదిలాడు
రవితేజ సినిమా అనౌన్స్ చేస్తే.. బెల్లంకొండ ఫస్ట్ లుక్ వదిలాడు

ఒకేసారి ఒకే కథతో రెండు సినిమాలు రానుండడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. 70, 80లలో ఆంధ్ర ప్రాంతాన్ని తన దోపిడీలతో వణికించిన నాగేశ్వరరావు అనే బందిపోటు కథతో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని కెఎస్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనుండగా బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మళ్ళీ నిర్మాతగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తామని, అలాగే దీనికి స్టువర్టుపురం దొంగ అనే టైటిల్ ను కూడా నిర్ధారించారు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానున్న నేపథ్యంలో ఇదే కథతో మరో సినిమా అనౌన్స్ అయింది. దొంగాట ఫేమ్ వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో కూడా సినిమా అనౌన్స్ అయింది. ఈ చిత్ర అనౌన్స్మెంట్ జరిగిన రెండో రోజుకే బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. నిజంగా బందిపోటు ఎలా ఉంటాడో అలానే ఫస్ట్ లుక్ ను దించడం విశేషం. వచ్చే ఏడాది ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

- Advertisement -

మరి ఒకే కథతో తెరకెక్కనున్న రెండు సినిమాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత కాలం ఆగకతప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All