
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చాలా బిజీగా ఉంటాడు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేయడం ఈయన ప్రత్యేకత. కచ్చితమైన ప్లానింగ్ తో ఈ ఫ్లో ను మాత్రం మిస్ అవ్వడు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ కు సౌత్ ఇండియన్ మూవీస్ ను రీమేక్ చేయడం కొత్తేమి కాదు. విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించాడు.
- Advertisement -
తాజా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ మరో సౌత్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి హిట్ గా మిగిలిన రాక్షసుడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు అక్షయ్. నిజానికి ఇది తమిళ్ సినిమా. రాక్షసన్ ను బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులోకి రీమేక్ చేసాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది.
- Advertisement -