
బాలీవుడ్ స్టార్ నటులు వరసగా ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటికే రన్బీర్ కపూర్, అలియా భట్, లతో పాటు పలువురు బాలీవుడ్ నటులకు కరోనా పాజిటివ్ సోకింది. వారందరూ ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ లో కోలుకుంటున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ హయ్యస్ట్ పెయిడ్ నటుడు అక్షయ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ సోకిందిట. సోషల్ మీడియాలో అక్షయ్ దీనిపై అధికారిక ప్రకటన చేసాడు. తనకు కరోనా పాజిటివ్ సోకిందని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు. అలాగే తనతో రీసెంట్ గా టచ్ లో ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం.
View this post on Instagram
???????? pic.twitter.com/w9Q7m54BUN
— Akshay Kumar (@akshaykumar) April 4, 2021