Homeగాసిప్స్బాలీవుడ్ లో మూడు సినిమాల డీల్ ను సైన్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

బాలీవుడ్ లో మూడు సినిమాల డీల్ ను సైన్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

బాలీవుడ్ లో మూడు సినిమాల డీల్ ను సైన్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
బాలీవుడ్ లో మూడు సినిమాల డీల్ ను సైన్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో డీసెంట్ సంఖ్యలో సినిమాలు చేసినా హిట్స్ మాత్రం తక్కువే. తన సినిమాలు అన్నిటికీ భారీ బుడ్జెట్స్ కావడంతో ప్రాఫిట్స్ అందుకున్న సినిమాలు తక్కువే. తాజాగా అల్లుడు అదుర్స్ అనే చిత్రాన్ని చేసాడు బెల్లంకొండ. ఈ సినిమాకు కూడా దాదాపు 35 కోట్ల మేరకు ఖర్చయినట్లు సమాచారం.

ఇక తన బాలీవుడ్ ఎంట్రీని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ యువ హీరో. ఛత్రపతి సినిమాను హిందీలో చేస్తున్నాడు. పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం పెన్ స్టూడియోస్ బెల్లంకొండతో మూడు సినిమాల డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేస్తోన్న ఛత్రపతి రీమేక్ కాకుండా ఈ బ్యానర్ లో మరో రెండు సినిమాలను కూడా చేయనున్నాడు. ఇందుకోసం మూడు సినిమాలకు కలిపి 35 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నాడు ఈ యువ హీరో. మరి బాలీవుడ్ లో శ్రీనివాస్ ఎంతవరకూ విజయవంతమవుతాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All