Homeటాప్ స్టోరీస్రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు'.. పాన్ ఇండియా రిలీజ్..!

రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’.. పాన్ ఇండియా రిలీజ్..!

Raviteja Tiger Nageswara Rao PAN India Release
 

మాస్ మహరాజ్ రవితేజ కూడా పాన్ ఇండియా మూవీ లీగ్ లో పాల్గొంటున్నాడు. అదేంటి అంటే రవితేజ కూడా తన 71వ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు. స్టువర్ట్పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అతన్ని ముద్దుగా టైగర్ నాగేశ్వర రావు అని పిలుస్తారు. స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకరు. అయితే ఆయన తెగింపు చూసి ఆయన్ను అందరు టైగర్ నాగేశ్వర రావు అని పేరు పెట్టారు.

1970వ దశకంలో అధికారులకు చుక్కలు చూపించిన గజదొంగ నాగేశ్వర రావు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. మద్రాస్ జైలు నుండి కూడా తెలివిగా తప్పించుకున్నాడట. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు.

- Advertisement -

అయితే నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే అందరికి తెలుసు.. అతను చేసిన మంచి పనులు ఎవరికి తెలియదు. దోచుకొచ్చిన సొత్తుని పేదలకు దానం చేసేవాడు. స్టువర్టుపురంలో పుట్టిన కారణంగా ఆయన చదువుకి దూరమయ్యాడని ఎంతోమంది విద్యార్ధులకు చదువు కోసం ధన సాయం చేశాడు. ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయని టైగర్ నాగేశ్వర రావు డైరక్టర్ వంశీ అన్నారు. మొత్తానికి రవితేజ పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వర రావు రాబోతుంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డరక్టర్ జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All