Homeటాప్ స్టోరీస్శ్రియ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

శ్రియ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

శ్రియ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!
శ్రియ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

గ‌త రెండు ద‌శాబ్దాలుగా త‌న‌దైన న‌ట‌న‌తో, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్న క్రేజీ హీరోయిన్ శ్రియ‌. కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు దాటినా ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. ఎంత మంది కొత్త భామ‌లు, క్రేజీ తార‌లు దూసుక‌చ్చినా ఇప్ప‌టికీ మెయిన్ హీరోయిన్ పాత్ర‌ల్లో రాణిస్తోంది. ఆమె పుట్టిన రోజు నేడు ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `గ‌మ‌నం` ఫ‌స్ట్ లుక్‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అతి సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌గా మెడ‌లొ మంగ‌ళ సూత్రం ధ‌రించి శ్రియ క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తీక్ష‌ణంగా ఆలోచిస్తున్న తీరు శ్రియ ఈ చిత్రంలో కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది.

- Advertisement -

మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. సినిమ‌యాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తూనే ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్ర ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All