Homeటాప్ స్టోరీస్శ్రీనివాస కళ్యాణం రివ్యూ

శ్రీనివాస కళ్యాణం రివ్యూ

srinivasa kalyanam movie reviewశ్రీనివాస కళ్యాణం రివ్యూ :
నటీనటులు : నితిన్ , రాశి ఖన్నా , జయసుధ
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : సతీష్ వేగేశ్న
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 9 ఆగస్టు 2018

నితిన్రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం ఈరోజు విడుదల అయ్యింది . సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

తల్లిదండ్రులకు దూరంగా చండీఘడ్ లో ఉద్యోగం చేస్తుంటాడు శ్రీనివాస్ ( నితిన్ ) , అక్కడే శ్రీదేవి ( రాశి ఖన్నా ) ని చూసి లవ్ లో పడతాడు . ఈ ప్రేమకు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు . అయితే శ్రీదేవి తండ్రి శ్రీనివాస్ కు షరతు విధిస్తాడు . శ్రీదేవి తండ్రి కి శ్రీనివాస్ కు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి ? దాని వల్ల వచ్చిన సమస్యలు ఏంటి ? వివాహ వేడుక ఎలా జరిగింది ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నితిన్ – రాశి ఖన్నా జోడి
తెలుగింటి సంప్రదాయాలకు పెద్ద పీట
ఆకట్టుకునే ఎమోషనల్ సీన్స్
నేపథ్య సంగీతం

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే అంశాలు లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న నితిన్ కు ఈ శ్రీనివాస కళ్యాణం తప్పకుండా బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమానే ! అలాగే సంప్రదాయాలకు విలువ ఇచ్చే యువకుడిగా నితిన్ నటన ఆకట్టుకుంది అలాగే తెరపై నితిన్ రాశి ఖన్నా జంట చూడముచ్చటగా ఉంది . గ్లామర్ తార అయిన రాశి ఖన్నా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది . ప్రకాష్ రాజ్ , జయసుధ , రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , నందితా శ్వేతా తదితరులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . భారీ తారాగణం తోడవ్వడంతో సినిమా కలర్ ఫుల్ గా ఉంది .

సాంకేతిక వర్గం :

ముందుగా దర్శకులు సతీష్ వేగేశ్న ని అభినందించాలి ఇటువంటి చిత్రం చేయాలనే ఆలోచన వచ్చినందుకు . పెళ్లి , బంధాలు , అనుభంధాలు అంటే బిజీ లైఫ్ లో లైట్ గా తీసుకుంటున్న సమయంలో పెళ్లి యొక్క విశిష్టత ని తెలియజేసే కథాంశంతో శ్రీనివాస కళ్యాణం చేయడం అభినందించతగ్గ విషయం . అయితే సెకండాఫ్ లో యువత ని ఆకట్టుకునే అంశాలు లేకుండా పోవడంతో కొంత డ్రాప్ అవుతుందేమో కానీ ఇలాంటి సినిమాని ప్రతీ ఒక్కరు కుటుంబంతో సహా చూడాల్సిన విధంగా మలిచాడు . మిక్కీ జె మేయర్ పాటలు బాగున్నాయి అయితే అంతకంటే నేపథ్య సంగీతం బాగుంది . సమీర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చింది . దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :

సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రం శ్రీనివాస కళ్యాణం

English Title: srinivasa kalyanam movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All