Homeటాప్ స్టోరీస్శ్రీనివాస కళ్యాణం టాక్ ఎలా ఉందంటే

శ్రీనివాస కళ్యాణం టాక్ ఎలా ఉందంటే

Srinivasa kalyanam preview talkనితిన్రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం ఈరోజు విడుదల అయ్యింది , ఇక ఓవర్ సీస్ లో అయితే అప్పుడే ప్రివ్యూ షోలు కూడా పడ్డాయి . ఆ ప్రివ్యూ షోల ప్రకారం టాక్ ఎలా ఉందొ తెలుసా …….. హిట్ అనే అంటున్నారు . కుటుంబ విలువలు , పెళ్లి ప్రాముఖ్యత బంధాలు , అనుబంధాలు , బంధువుల విశిష్టత గురించి చక్కగా చూపించాడట దర్శకులు సతీష్ వేగేశ్న . దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . దాంతో ప్రీమియర్ షోలకు డిమాండ్ ఏర్పడింది దానికి తగ్గట్లుగా టాక్ కూడా తోడయ్యింది .

సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కానీ హాయిగా సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని అంటున్నారు . ప్రకాష్ రాజ్ , జయసుధ , రాజేంద్రప్రసాద్ , నరేష్ , సితార , నందితా శ్వేతా తదితరులు నటించిన ఈ చిత్రంలో నితిన్ – రాశి ల జంట చూడముచ్చటగా ఉందట . పెళ్లి అంటే ఈరోజుల్లో తూతూ మంత్రంగా సాగిపోతోంది , ఇక నగరాల్లో అయితే ఆ పెళ్లి వేడుక కూడా మమ అనిపిస్తున్నారు దాంతో భార్యాభర్తల అనుబంధానికి సరైన అర్ధమే తెలుసుకోవడం లేదు , చిన్న గొడవలు వస్తే విడాకులు అని అంటున్నారు . అలాంటి వాళ్లకు ఈ సినిమా ఓ గైడ్ అని అంటున్నారు . మొత్తానికి ప్లాప్ లతో సతమతం అవుతున్న నితిన్ ఈ సినిమాతో హిట్ కొట్టినట్లే !

- Advertisement -

English Title: Srinivasa kalyanam preview talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All