Homeటాప్ స్టోరీస్నితిన్ హిట్ కొట్టినట్లేనా

నితిన్ హిట్ కొట్టినట్లేనా

nithin hopes on srinivasa kalyanamగతకొంతకాలంగా నితిన్ కు హిట్ లేక కెరీర్ పరంగా సతమతం అవుతున్నాడు . వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న నితిన్ కు శ్రీనివాస కళ్యాణం చిత్రం మళ్ళీ హిట్ మేనియా అందిస్తుందా ? అంటే ఔననే అంటున్నారు . నితిన్ కు శ్రీనివాస కళ్యాణం హిట్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నారు బయ్యర్లు . కుటుంబ కథా చిత్రాలు కోరుకునే వాళ్లకు శ్రీనివాస కళ్యాణం చక్కని ఛాయిస్ అని విశాసిస్తున్నారు . పైగా ఈ సినిమాని నిర్మించింది దిల్ రాజు కాగా శతమానం భవతి వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న కూడా తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి .

ఈ చిత్రంతో యూత్ ని ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు కూడా పొందుతానని ఆశిస్తున్నాడు నితిన్ . దిల్ రాజు – నితిన్ ల కాంబినేషన్ లో దాదాపు 14 ఏళ్ల క్రితం దిల్ అనే సినిమా వచ్చింది అది సూపర్ హిట్ అయ్యింది కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ నితిన్ – దిల్ రాజు కలిశారు దాంతో నితిన్ హిట్ కొట్టినట్లే అని అంటున్నారు . ఇక ఈ సినిమా హిట్ అవుతుందా ? లేదా ? అన్నది రేపు తేలిపోనుంది .

- Advertisement -

English Title: nithin hopes on srinivasa kalyanam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All