
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వుంది. క్రేజీ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రభాస్ నటించిన `సాహో` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించిన ఈ పొడుగు కాళ్ల సుందరి త్వరలో మరో తెలుగు చిత్రంతో హంగామా చేయబోతున్న విషయం తెలిసిందే. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిక్షనల్ పిరియాడిక్ పిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొఘల్ రాజకుమారిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించబోతోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమిక్స్ సాంగ్ `చిట్టియాన్ కలైయా వే` తో యూట్యూబ్‌లో ఇప్పటికీ హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం `సీరియల్ కిల్లర్`, అటాక్, భూత్ పోలీస్ వంటి చిత్రాల్లో నటిస్తున్న జాక్వెలిన్ తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటో యువ హృదయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
షార్ట్ అండ్ వైట్ లాక్ నెక్ టాప్ ధరించి పోజులిచ్చింది. చూడ్డానికి నేచురల్ గా కనిపిస్తున్నా తనదైన స్టైల్లో జాక్వెలిన్ కుర్రకారుని హీటెక్కించేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. థై షో చేస్తూ జాక్వెన్ పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.