Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్‌!
ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్‌!

పవ‌న్ కళ్యాణ్ నిన్న `వకీల్ సాబ్` షూటింగ్ కోసం మియాపూర్ మెట్రో లో ప్ర‌యాణించిన విష‌యం తెలిసిందే. ఆయనతో పాటు దిల్ రాజు ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్ కోసం  మెట్రోలో ప్ర‌యాణించిన ప‌వ‌న్ కొద్ది సేపు సంద‌డి చేశారు. అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు కూడా. కానీ కొంత మంది ఆయ‌న చేతికున్న వాచ్ ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు.

మెట్రోలో మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణించిన ప‌వ‌న్ బ్లాక్ క‌ల‌ర్ సూట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ ప్ర‌యాణంలో క‌నిపించిన వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఓ రైతుతో మాట్లాడిన ప‌వ‌న్ ప్ర‌స్తుత ప‌రిస్థితి ఎలా వుంని అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేతికి రోలెక్స్ వాచ్ క‌నిపించింది. దీని విలువ అక్ష‌రాలా 40 ల‌క్ష‌లు. సింపుల్ సిటీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ప‌వ‌న్ 40 ల‌క్ష‌ల రోలెక్స్ వాచ్‌ని ధ‌రించ‌డం ఏంటని కొంత మంది నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది,

- Advertisement -

దీంతో రంగంలోకి దిగిన ప‌వ‌న్ ఫ్యాన్స్ సినిమాలో ఆయ‌న రోలెక్స్ వాచ్ ధ‌రించి క‌నిపిస్తార‌ని, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ చూస్తే ఈ విష‌యం తెలుస్తుంద‌ని క్లారిటీ ఇచ్చారు. కంటినేష‌న్‌లో భాగంగానే ప‌వ‌న్ రోలెక్స్ వాచ్‌ని ధ‌రించి మెట్రో ప్ర‌యాణంలో క‌నిపించార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో ప‌వ‌న్ ధ‌రించిన రోలెక్స్ వాచ్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All