Homeటాప్ స్టోరీస్హ‌రీష్‌శంక‌ర్ మూవీలో ప‌వ‌న్ పాత్ర ఇదేనా?

హ‌రీష్‌శంక‌ర్ మూవీలో ప‌వ‌న్ పాత్ర ఇదేనా?

Pawan Kalyan to play don character in Harish shankar film ?
Pawan Kalyan to play don character in Harish shankar film ?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం `గ‌బ్బ‌ర్‌సింగ్‌`. దాదాపు ప‌దేళ్ల క్రితం వీరిద్ద‌రి క‌ల‌యిక‌లొ రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌గా నిలిచింది. ప‌వ‌న్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. ఈ కాబినేష‌న్‌లో మ‌రో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు హ‌రీష్ శంక‌ర్ రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే.

మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. దేశ భ‌క్తిని ప్ర‌బోధిస్తూనే ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌క్కాగా ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌ని ప‌వ‌న్ కోసం హ‌రీష్‌శంక‌ర్ సిద్ధం చేశార‌ట‌. ఈ మూవీలోని పవ‌న్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంద‌ని తెలిసింది. మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ప‌వ‌న్ డాన్‌గా క‌నిపిస్తార‌ని ఇన్ సైడ్ టాక్‌.

- Advertisement -

దీంతో ఈ మూవీపై హాట్ చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్‌ని మ‌ళ్లీ ఏ రేంజ్‌లో హ‌రీష్ శంక‌ర్ ప్ర‌జెంట్ చేయ‌బోతున్నారా? అని ఫ్యాన్స్ తోపాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆరాతీస్తున్నాయ‌ట‌. పవ‌న్ ప్ర‌స్తుతం `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ త‌రువాత మ‌ల‌యాళ హిట్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. ఆ త‌రువాత క్రిష్ పిరియాడిక్ ఫిల్మ్ వుంటుంది. ఆ త‌రువాతే హ‌రీష్‌శంక‌ర్ మూవీ వుంటుంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All