
సుశాంత్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం తరువాత రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఈ మృతి వెనక డ్రగ్స్ కోణం కూడా వుందని తేలడంతో ఎన్‌సీబీ అధికారులు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకోవడం, ఆ తరువాత డ్రగ్స్ పెడ్లర్‌లతో ఆమెకు, ఆమె సోదరుడు షోవిక్ కు సంంధాలున్నాయని తేలడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. అప్పటి నుంచి డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. తాజాగా కన్నడ సీమలోనూ డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది.
ఇప్పటికే ఎన్‌సీబీ అధికారులు నటి రాగిణి దివ్వేదీతో పాటు సంజనని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరిని ఇంటరాగేట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించడంతో కన్నడ నాట డ్రగ్స్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో చందమామ కాజల్ అగర్వాల్ హాట్ గళ్ సంజనతో కలిసి కాసినోలో డబ్బులు పెడుతున్న ఓ ఫొటో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌ని ఊపేస్తోంది.
ఇది చాలా నెలల క్రితం తీసిన ఫొటో అని, ఇది కాసినో ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌లు పాల్గొనగా క్లిక్ మరిపించిన పిక్ అని తెలుస్తోంది. కాజల్, సంజనతో పాటు తాప్సీ, తమన్నా, హన్సిక, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా ఈ కాసినోని సరదాగా విజిట్ చేశారని చెబుతున్నారు. ఇటీవల డ్రగ్స్ వివాదంలలో అరెస్ట్ అయిన సంజన డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్‌తో పాటు యురిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు ఆమెని హెచ్చరించినట్టు తెలిసింది.